రేపటి తరం వాటర్ హీటర్‌లను ప్రవేశపెట్టిన రాకోల్డ్

అనుభవం పనితీరు, సామర్థ్యం, ​​సౌలభ్యం మరియు నియంత్రణ

కొత్త ఓమ్నిస్ శ్రేణి గీజర్‌ల 2023 ఎడిషన్ మరియు ఆల్-న్యూ ఆల్ట్రో రేంజ్ గీజర్‌లు అన్ని రాకోల్డ్ అధీకృత స్టోర్‌లలో అలాగే ప్రముఖ ఆన్‌లైన్, రిటైల్ చైన్ పార్ట్నెర్ల వద్ద అందుబాటులో ఉంటాయి.

భారతదేశంలోని ప్రముఖ గృహోపకరణాల బ్రాండ్‌లలో ఒకటైన రాకోల్డ్, ప్రీమియం శ్రేణి వాటర్ హీటర్‌లను ప్రవేశపెట్టడంతో వాటర్ హీటింగ్ మార్కెట్ ను పునర్నిర్వచించింది. అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త ఓమ్నిస్, ఆల్ట్రో శ్రేణుల వాటర్ హీటర్‌ల 2023 ఎడిషన్‌లను ఈ బ్రాండ్ ప్రవేశపెట్టింది. ప్రఖ్యాత ఇటాలియన్ డిజైనర్ ఉంబెర్టో పలెర్మో ఇటలీలో కొత్త శ్రేణి వాటర్ హీటర్‌లను రూపొందించారు. ఈ అద్భుతమైన డిజైన్‌లు మీ స్నానపు గదుల లోపలి భాగాన్ని ఎలివేట్ చేస్తాయి,సరి కొత్త హంగును జోడిస్తాయి. వినూత్నమైన, ఆధునికమైన, శక్తి-సమర్థవంతమైన వాటర్ హీటింగ్ పరిష్కా రాలను అందించడంలో రాకోల్డ్ అచంచలమైన అంకితభావానికి అత్యాధునిక ఉత్పాదనలు ఒక ఉదాహరణ.

కొత్తగా ఆవిష్కరించబడిన వాటర్ హీటర్లు వినూత్న ఫీచర్లు, పరిష్కారాల ద్వారా వినియోగదారుల విభిన్న అవసరాలు,మారుతున్న ప్రాధాన్యతలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇవి అత్యంత శ్రద్ధతో రూపొం దించబడినవి. సౌలభ్యం, భద్రత, సామర్థ్యం,స్నానం పరిపూర్ణమైన ఆనందాన్ని అందించడానికి వీలుగా అవి పరి పూర్ణ రీతిలో నిర్మించబడ్డాయి.

అరిస్టన్ గ్రూప్ ఇండియా ప్రై. లి. మేనేజింగ్ డైరెక్టర్, కంట్రీ మేనేజర్ (ఇండియా)మోహిత్ నరులా ఈకొత్త ప్రయోగంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రాకోల్డ్ 60 సంవత్సరాలుగా నాణ్యత, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది.వినియోగదారుల అవసరాలు, వారి మారు తున్న కొనుగోలు, వినియోగ ప్రవర్తనలను అర్థం చేసుకోవడంలో మేం నిరంతరం పెట్టుబడి పెట్టాం. ఇటు వంటి అధ్యయనాలు సరైన ఉత్పాదనని అభివృద్ధి చేయడంలో మాకు సహాయపడ్డాయి.కొత్త శ్రేణి వాటర్ హీటర్లు నవతరం వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి వీలుగా అభివృద్ధి చేయబడ్డాయి. మా వాటర్ హీటర్‌లు మెరుగైన నియంత్రణను అందించడమే కాకుండా అద్భుతమైన శక్తి సామర్థ్యాన్ని, మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ వినూత్న ఫీచర్లలో వాయిస్ కంట్రోల్, ఐఓటీ ఎనేబుల్డ్స్మార్ట్ యాప్-ఆధారిత నియంత్రణ, డిజిటల్ డిస్‌ప్లే, ఆటో డయాగ్నసిస్, అధునాతన మైక్రోప్రాసెసర్-ఆధారిత ఫీచర్‌లు వంటివి మరెన్నో ఉన్నాయి. కొత్త ఓమ్నిస్ శ్రేణి, తన ప్రస్తుత పోర్ట్‌ఫోలియోతో పాటు, 5-స్టార్ BEE రేటింగ్‌ ను అందిస్తుంది, ఇది దాని వినియోగదారులకు శక్తిని ఆదా చేస్తుంది.సుస్థిరదాయకమైన, సమగ్ర వృద్ధి కోసం అత్యంత శక్తి-సమర్థవంతమైన ఉత్పత్తులను తయారు చేయడానికి మాకు గల నిబద్ధతను నొక్కి చెబుతుంది” అని అన్నారు.

ఈ మైలురాయిని సాధించడంపై సంస్థ ఆసియా వైస్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ స్టానో తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అరిస్టన్ గ్రూప్‌నకు భారతదేశం దృష్టి పెట్టాల్సిన మార్కెట్ గా, వృద్ధిని ముమ్మరం చేసేదిగా ఉంది. పెరుగుతున్న జనాభా, ఆర్థిక అభివృద్ధి, మౌలిక వస తులు ఒక వ్యాపార విభాగంలో పటిష్ట,విశ్వసనీయ విస్తరణకు మూలస్తంభాలు. థర్మల్ కంఫర్ట్, శక్తి సామ ర్థ్యంలో అరిస్టన్ గ్రూప్అంతర్జాతీయ అగ్రగామిగా ఉంది.పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే, భారతీయ వినియోగ దారులకు అధిక-నాణ్యత వేడి నీటి పరిష్కారాలను అందించడంమా ఉద్దేశం. భారతదేశంలోని ఉష్ణ సౌలభ్యానికి పర్యాయపదంగా ఉన్న రాకోల్డ్ వారసత్వం, అరిస్టన్ గ్రూప్ ఇటాలియన్ సంప్రదాయం కల యిక అనేది భారతీయ వినియోగదారుల డిమాండ్, అభిరుచిని ఉత్తమంగా తీర్చడానికి సృష్టించబడింది, అభివృద్ధి చేయబడింది’’ అని అన్నారు.

ఓమ్నిస్ 2023: సాటిలేని వినూత్నత, కనెక్టివిటీ, సౌలభ్యంతో ప్రీమియం శ్రేణి

స్టోరేజ్ గీజర్‌లు

ఓమ్నిస్ DG వై-ఫై:మీ హాట్ షవర్‌లపై అపూర్వమైన నియంత్రణను అందించే నిజమైన మాస్టర్-పీస్ ఇది. ఈ వాటర్ హీటర్ దాని వినియోగదారులకు అందించే సౌలభ్యం గురించి ఎవరైనా మళ్లీ ఆలోచించేలా చేస్తుంది. సొగసైన నలుపు రంగులో లభిస్తుంది, ఇది రెండు సామర్థ్య ఎంపికలలో వస్తుంది: 15లీ. మరి యు 25 లీటర్లు. ఓమ్నిస్ DG వైఫైవాయిస్ కంట్రోల్ ఫీచర్‌తో వస్తుంది, ఇది సాధారణ వాయిస్ కమాండ్‌ల సహాయంతో అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్‌ని ఉపయోగించి వాటర్ హీటర్‌లతో ఇంటరాక్ట్  కావడానికి, నియంత్రించడానికి, వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. ఇప్పుడిక“అలెక్సా, వాటర్ హీటర్ ఆన్ చేయి” అని చెబితే చాలు.

ఓమ్నిస్ DG వైఫైఇతర ముఖ్యమైన లక్షణం దాని కృత్రిమ మేధస్సు-ఆధారిత ECO కార్యాచరణ, ఇది సౌకర్యంపై రాజీ పడకుండానే తక్కువ శక్తి వినియోగాన్ని అందిస్తుంది. ఇంకా, వినియోగదారులు రియల్-టైమ్ నోటిఫికేషన్‌లను యాక్సెస్ చేయవచ్చు, రాకోల్డ్ నెట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయగల అంతర్ని ర్మిత Wi-Fi నియంత్రణ ఫీచర్ ద్వారా శక్తి వినియోగాన్ని పర్యవేక్షించవచ్చు.

ఓమ్నిస్ DG:ఓమ్నిస్ DG అనేది సాంకేతికంగా అభివృద్ధి చెందిన వాటర్ హీటర్, ఇది అత్యుత్తమ పనితీరు, అత్యంత భద్రత, వినియోగదారునకు సౌకర్యాన్ని అందించడానికి రూపొందించబడింది. శాండ్‌ స్టార్మ్ గోల్డ్, బ్లాక్ అనే రెండు రంగుల  ఎంపికలలో లభిస్తుంది, ఈ మోడల్ 10, 15 మరియు 25 లీ. విభిన్న కెపాసిటీలో వస్తుంది.

ఈ వాటర్ హీటర్ ప్రత్యేక లక్షణాలు టచ్ కంట్రోల్, అధునాతన మైక్రోప్రాసెసర్ ఆధారిత ఆటో-పవర్-ఆఫ్, ఆటో-డయాగ్నసిస్ ఫంక్షనాలిటీలతో కూడిన డిజిటల్ డిస్‌ప్లే. ఇది పరిశ్రమ-మొదటి సిల్వర్ అయాన్ టెక్నాలజీ. బ్యాక్టీరియా పెరుగుదలను సమర్థవంతంగా నిరోధిస్తుంది, ప్రతిసారీ సురక్షితమైన, ఆరోగ్యకర మైన వేడి నీటిని అందిస్తుంది.

ఓమ్నిస్ DGలోని మైక్రోప్రాసెసర్ ఆటో-పవర్-ఆఫ్, ఆటో-డయాగ్నసిస్ అనే రెండు అత్యంత శక్తివంతమైన ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది. ఆటో-ఆఫ్ ఫంక్షనాలిటీ వినియోగదారులు వాటర్ హీటర్‌ను స్వయం చాలకంగా స్విచ్ ఆఫ్ చేయడానికి టైమర్‌ను ముందే సెట్ చేయడానికి వీలు కల్పిస్తుంది, ఇక, ఆటో-డయాగ్నసిస్ ఫంక్షనాలిటీ అనేది ఉత్పాదన పనితీరును నిరంతరం పర్యవేక్షించడం ద్వారా, సురక్షిత పారా మితులలో పని చేస్తుందని నిర్ధారించుకోవడం ద్వారా వినియోగదారులకు అత్యంత భద్రతను అందిస్తుంది.

ఓమ్నిస్ R:ఈ వాటర్ హీటర్ ఆకర్షణీయమైన చార్మింగ్ గ్రే,  ప్రీమియం వైట్ రంగులలో లభిస్తుంది. 10, 15 మరియు 25 లీటర్లు అనే మూడు కెపాసిటీ ఆప్షన్‌లలో లభిస్తుంది. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి, సరిలేని పనితీరును అందించడానికి రూపొందించబడింది. ఓమ్నిస్ R చిల్డ్రన్ కేర్ మోడ్‌తో వస్తుంది, ఇది షవర్‌లో విపరీతమైన వేడి నీటికి ప్రమాదవశాత్తు గురి కాకుండా ఇంట్లో పిల్లల భద్రతను నిర్ధారిస్తుంది. కొత్త ఓమ్నిస్ R టైటానియం ప్లస్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది, ఇది సాటిలేని మన్నికను,హార్డ్ వాటర్ (కఠినజలం) పరిస్థితులలో తుప్పు నుండి ట్యాంకుకు రక్షణను అందిస్తుంది. ఇది సేఫ్టీ+ ఫీచర్ ద్వారా మరింత మెరుగుపరచబడింది, ఇది మూడు లేయర్ల రక్షణను అందిస్తుంది. అంతేగాకుండా, ఫ్లెక్సోమిక్స్‌ని చేర్చడం వల్ల ఎక్కువసేపు జల్లులు కురిపించడానికి వేడి నీటి సుస్థిరమైన సరఫరాను అందిస్తుంది.

ఆల్ట్రో 2023:వేగంగా నీటిని వేడి చేయడానికి స్టైలిష్ ఇన్‌స్టంట్ గీజర్‌ల కొత్త యుగం

ఆల్ట్రో i+: ఈ ప్రీమియం ఇన్‌స్టంట్ గీజర్ సొగసైన గ్రే సైడ్ రింగ్‌లలో అందుబాటులో ఉంది, ఎంచుకోవడానికి 3 మరియు 6 లీటర్లు అనే రెండు కెపాసిటీలను అందిస్తోంది. ఇది వేడి నీరు సిద్ధంగా ఉన్నప్పుడు మీకు తెలియజేయడానికి సహజమైన స్మార్ట్ LED రింగ్, అదనపు సౌలభ్యం కోసం వంటగది, బాత్ మోడ్‌లతో అనుకూలీకరించిన అప్లికేషన్ వంటి వినూత్న ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది.

6-లీటర్ వేరియంట్ తన డ్యూరోనాక్స్ సాంకేతికతతో ప్రత్యేకంగా నిలుస్తుంది, ఇది హార్డ్ వాటర్ నుండి రక్షణను అందిస్తుంది.  ఉత్పాదనజీవిత కాలాన్ని పొడిగిస్తుంది. మరోవైపు, 3-లీటర్ మోడల్ 3 kW,4.5 kW అనే రెండు హీటింగ్ పవర్ ఆప్షన్‌లతో వేగవంతమైన వేడిని కలిగి ఉంటుంది.

ఆల్ట్రో i: ఆల్ట్రో i​​ఇన్‌స్టంట్ వాటర్ హీటర్ రెండు విభిన్న సామర్థ్యాలను అందిస్తుంది: 1 మరియు 3 లీటర్లు.గ్రే మరియు బ్లూ (3-లీటర్ వేరియంట్‌కు ప్రత్యేకం)రెండు-రంగు ఎంపికలలో లభ్యం. ఇటీవలి విడుదల అయిన  ఇటాలియన్ మాస్టర్ పీస్ డిజైన్, మీ స్పేస్ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి డ్యూయల్ LED సూచికలతో స్విర్ల్ వేవ్ డిజైన్‌ను ప్రదర్శిస్తుంది. ఇది ప్రత్యేకంగా అధిక పీడన నిరోధకతతో రూపొందించబ డింది, ఇది ఎత్తైన భవనాలలో అమర్చేందుకు అనుకూలంగా ఉంటుంది. అంతేగాకుండా, ఇది వేగవంత మైన తాపన సామర్థ్యాలను (3 Kw మరియు 4.5 Kw) అందిస్తుంది. అదనపు భద్రత, బ్యాక్‌ఫ్లో నివారణ కోసం యాంటీ-సిఫోన్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

ఆల్ట్రో i ​​DN: రాకోల్డ్సరికొత్త మోడల్‌ను గ్రే కలర్ రింగ్ ఆప్షన్‌లో పరిచయం చేసింది. ఇందులో 3 లీటర్ల సామర్థ్యం ఉంది. అత్యుత్తమ పనితీరు, మన్నిక కోసం SS#316Lతో కలిపి అత్యాధునిక డ్యూరోనాక్స్ టెక్నాలజీతో హార్డ్ వాటర్ కండిషన్స్‌లో పనిచేసేలా ఈ అధునాతన వాటర్ హీటర్ ప్రత్యేకంగా తయారు చేయబడింది. 3 లేయర్‌ల భద్రత కోసం సేఫ్టీ ప్లస్, వేగవంతమైన హీటింగ్, వాటర్ హీటర్ సుదీర్ఘ జీవిత కాలం కోసం యానోడ్, ఎత్తైన భవనాల కోసం అధిక పీడన నిరోధకత,మెరుగైన దృశ్యమానత కోసం డ్యూయల్ ఎల్‌ఈడీ సూచికలు వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.

కాబట్టి, రాకోల్డ్‌తో వాటర్ హీటింగ్ భవిష్యత్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. సరికొత్త స్థాయి సౌకర్యం మరియు సంతృప్తిని అనుభవించండి.