మ్యాట్రెస్ కొనుగోళ్లపై వెడ్డింగ్ సీజన్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించిన సెంచరీ మ్యాట్రెస్స్స్
రూ. 10,000 విలువ గల ఉచిత బహుమతులు బెడ్‌షీట్, పిల్లో సెట్, డోహార్ లను అందిస్తుంది
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్ అయిన సెంచరీ మ్యాట్రెస్ వివాహ సీజన్‌లో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ బ్రాండ్ ప్రతి పరుపు కొనుగోలుపై రూ. 10,000 దాకా విలువైన బెడ్‌షీట్, పిల్లో సెట్, దోహార్‌తో సహా ఉచిత కానుకలను అందిస్తోంది. వివాహ ఆఫర్ జూన్ 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. సెంచరీ స్టోర్‌లు మరియు https://www.centuaryindia. com/ వెబ్‌సైట్ లో కొనుగోలుదారులు ఈ ప్రత్యేక ఆఫర్‌ను పొందవచ్చు.
కాపర్ జెల్ మెమరీ ఫోమ్, యాంటీ మైక్రోబియల్ ట్రీట్‌మెంట్, బ్రీతబుల్ CNC-ఆకారపు ఫోమ్‌లు మొదలైన వినూత్న ఉత్పత్తులతో సెంచరీ మ్యాట్రెస్ ఈ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. కంపెనీ 18 రాష్ట్రాల్లో 4,500+ మల్టీ – బ్రాండ్ స్టోర్లు, 450+ ప్రత్యేక బ్రాండ్ స్టోర్లతో ఉంది. ఇది అన్ని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై గణనీయ ఉనికిని కలిగి ఉంది.
ఈ సందర్భంగా సెంచరీ మ్యాట్రెస్స్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఉత్తమ్ మలాని గారు మాట్లాడుతూ, “వివాహంలో ఇద్దరి ఆత్మలు కలిసినట్లే, జీవితకాలం అంతా సుఖప్రదమైన, ఆనందకరమైన నిద్రను ఏకం చేయాలని మేం విశ్వసిస్తున్నాం. మా పరుపులు మిమ్మల్ని గొప్ప ప్రశాంతతలో ఉంచేలా చాలా చిన్న అంశాలను కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తూ రూపొందించబడ్డాయి. ప్రతి రాత్రి నిద్ర ఒక కల నిజమయ్యేలా చేస్తుంది. వివాహ సీజన్‌లో మా పరిమిత-కాల ఆఫర్ ప్రేమ, విశ్రాంతి రాత్రులను వేడుక చేసుకునే అవకాశం’’ అని అన్నారు.
సెంచరీ పశ్చిమ, తూర్పు మార్కెట్లలో తన రిటైల్ ఉనికిని విస్తరించాలని, 4,500+ నుండి 10,000+
అవుట్ లెట్‌లకు బహుళ-బ్రాండ్ స్టోర్‌లలో తన ఉనికిని పెంచుకోవాలని యోచిస్తోంది. ఇది బ్రాండ్
స్టోర్ కౌంట్ ను 450+ నుండి 700+కి పెంచనుంది. 2025 నాటికి కనీసం 100 ఎక్స్‌క్లూజివ్
ఎక్స్ పీరియన్స్ స్టోర్‌లను ప్రారంభించనుంది. వృద్ధిని మరింత పెంచడానికి AR, 3D రెండర్‌లు మొదలైన
సాంకేతికతలతో UI/UX లో కూడా బ్రాండ్ పని చేస్తోంది.