సరికొత్త ఎనేబుల్డ్మే డ్ఇన్ఇండియా పేటీఎం సౌండ్‌బాక్స్
భారతదేశ ప్రముఖ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ, క్యూఆర్, మొబైల్ చెల్లింపుల మార్గదర్శి అయిన పేటీఎం తిరుగులేని, సురక్షిత చెల్లింపు కలెక్షన్స్ తో దేశవ్యాప్తంగా వ్యాపార భాగస్వాములను మరింత శక్తివంతం చేయడానికి 4G-ఎనేబుల్డ్ సౌండ్‌బాక్స్ 3.0ని ప్రారంభించింది. 4G సౌండ్‌బాక్స్ ఈ తరహాలో మొదటి-రకం. పరిశ్రమలోనే అత్యంత వేగవంతంగా తక్షణ నిజ-సమయ చెల్లింపు అలర్ట్స్ కోసం సుస్థిరమైన కనెక్టివిటీని ఇది అందిస్తుంది. 4G నెట్‌వర్క్ పని చేయని ప్రాంతాల్లో, అంతరాయం లేని కనెక్టివిటీ కోసం ఇది స్వయంచాలకంగా 2G నెట్‌వర్క్ కి మారుతుంది. 4G సౌండ్‌బాక్స్ కొత్త డిజైన్‌లో వస్తుంది. పరిశ్రమలో అత్యుత్తమమైన విధంగా 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
పేటీఎం మేడ్-ఇన్-ఇండియా సౌండ్‌బాక్స్ అత్యంత మన్నికైనది, స్ప్లాష్ ప్రూఫ్. అనుకూలత సౌలభ్యం కోసం, పేటీఎం 4G సౌండ్‌బాక్స్ లో కొత్త ఫీచర్ ప్రారంభించబడింది. దీని ద్వారా వ్యాపారులు పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ ద్వారా దాని భాషను మార్చవచ్చు. ఈ స్వీయ-సహాయక పరికరం ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఒడియాలతో సహా 11 భాషలకు మద్దతు ఇస్తుం ది. వ్యాపారులకు సౌండ్‌బాక్స్ 3.0తో 3-ఇన్-1 ప్రయోజనాలు అందించబడ్డాయి — పేటీఎం మార్క్యూ లెండింగ్ పార్టనర్‌ల ద్వారా తక్షణ రుణ సౌకర్యం, చెల్లింపుల స్వీకరణపై హామీ ఇవ్వబడిన క్యాష్ బ్యాక్‌లు, 24-గంటల హెల్ప్ లైన్, 1-గంట కాల్ బ్యాక్ పాలసీతో హామీపూర్వక మద్దతు.
టెక్ ఇన్నోవేటర్ పేటీఎం భారతదేశంలో పేటీఎం సౌండ్‌బాక్స్ తో ఆడియో నిర్ధారణలను ప్రారంభించింది. పేటీఎం అగ్రగామి పరికరం వ్యాపారులకు ఇష్టమైనదిగా కొనసాగుతోంది. కంపెనీకి ఆఫ్‌లైన్ చెల్లింపుల నాయకత్వాన్ని బలపరుస్తోంది. 31 మార్చి 2023 నాటికి, 6.8 మిలియన్ కంటే ఎక్కువ మంది వ్యాపారులు ఇప్పుడు పేటీఎం సౌండ్‌బాక్స్, పిఒఎస్ వంటి చెల్లింపు పరికరాల కోసం సభ్యత్వాలను చెల్లిస్తున్నారు.