అందుబాటు ధరలో, అందరికీ చేరువలో రొమ్ము కేన్సర్ చికిత్స

శరవేగంగా వృద్ధి చెందుతున్న, పరిశోధన ఆధారిత పూర్తిగా సమగ్రపర్చబడిన ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన, భారతదేశంలోని హైదరాబాద్ ప్రధానకేంద్రంగా పని చేస్తున్న ఎంఎస్ఎన్ గ్రూప్ ప్రపంచపు మొట్టమొదటి జనరిక్ పాల్బోసిస్లిబ్ ట్యాబ్లెట్స్ (PALBOREST) 75/100/125mg లలో పాల్బొరెస్ట్ బ్రాండ్ నేమ్ కింద అడ్వాన్స్డ్ బ్రెస్ట్ కేన్సర్ థెరపీ కోసం ఆవిష్కరించింది.
పాల్బోసిక్లిబ్ ను మరి కొన్ని కంపెనీలు కూడా క్యాప్స్యూల్ డోసేజ్ రూపంలో ఆవిష్కరించినప్పటికీ లేదా ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ ఔషధాన్ని మాత్రల రూపంలో అందించేందుకు మాత్రం ఎంఎస్ఎన్ ల్యాబ్స్ చొరవ తీసుకుంది. ఆ విధంగా ఇన్నోవేటర్ పాల్ బేస్ టాబ్లెట్స్ కు అనుగుణమైన విధంగానే సంస్థ మాత్రలు రూపుదిద్దుకున్నాయి.
125 ఎంజీ మాత్ర వెల రూ.257.14, 100 ఎంజీ మాత్ర ధర రూ.233.28, 75 ఎంజీ ధర రూ.214.29 గా లభించే పాల్బొరెస్ట్, ఇన్నోవేటర్ టాబ్లెట్ తో పోలిస్తే మరింత అందుబాటులో, దానితో సమానమైందిగా ఉంది.
ఈ మాత్రలు, క్యాప్సూల్ డోసేజ్ రూపంతో పోలిస్తే మరింత విలక్షణమైన ప్రయోజనాన్ని కలిగిఉన్నాయి. ఎందు కంటే వీటిని ఆహారంతో పాటుగా లేదా విడిగా కూడా తీసుకోవచ్చు. ఈ మాత్రలను ప్రొటాన్ పంప్ ఇన్హి బిటర్స్ (పిపిఎల్ లు) లేదా యాంటాసిడ్స్ తో కూడా తీసుకోవచ్చు. లాక్టోజ్ (పాల ఉత్పాదన) లేదా గిలటిన్ ఈ ఈ టాబ్లెట్ ఫార్ములేషన్ డోస్ లో ఉండదు. అది కూడా ఈ ఔషధం సామర్థ్యానికి తోడ్పడుతుంది.
పాల్బోరెస్ట్ అనేది రోగికి అనుకూలంగా ఉండేలా, మూడు వారాలకు వేసుకునేలా, ఒక వారం వేసుకోకుండా ఉండేలా ట్రీట్ మెంట్ షెడ్యూల్ కు వీలుగా ఒక్కోటి 7 మాత్రలు ఉండే 3 స్ట్రిప్స్ ప్యాక్ లో లభిస్తుంది.
హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్, హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రెసిప్టర్ నెగెటివ్ లోకల్లీ అడ్వాన్స్ డ్ లేదా మెటా స్టాటిక్ రొమ్ము కేన్సర్ లకు ఉపయోగించేందుకు వీలుగా పాల్బోసిక్లిబ్ యూఎస్ఎఫ్ డిఎ, ఈఎంఏ, సీడీఎస్ సిఓలచే ఆమోదం పొందింది.
ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ గ్రూప్ వ్యాఖ్యానిస్తూ, ‘‘మెరుగైన చికిత్స ఫలితాల సాధనకు, రోగులపై ఆర్థిక భారం తగ్గించేందుకు వీలుగా అందుబాటు ధరల్లో కేన్సర్ ఔషధాలను రూపొందించేందుకు పరిశోధనలు చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొంది.
‘‘రొమ్ము కేన్సర్ అనేది నేడు భారతదేశ మహిళలను ప్రభావితం చేస్తున్న ప్రధాన కేన్సర్ గా ఉంది. పాల్బోరెస్ట్ ను అందుబాటు ధర వద్ద ఆవిష్కరించడం అనేది అడ్వాన్స్ డ్ బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడే వారికి కాస్తంత ఉపశమనం ఇచ్చేలా ఉంటుంది’’ అని తెలిపింది.
ఈ ఉత్పాదన ఏపీఐ నంచి ఫార్ములేషన్ దాకా, పూర్తిగా సంస్థ లోనే అభివృద్ధి చేయబడి, రూపొందించబడింది. యూఎస్ఎఫ్ డిఎ / ఈయూ ఆమోదిత కేంద్రాల్లో ఇది తయారు కావడం అనేది నాణ్యమైన ఔషధాలు అందు బాటు ధరల్లోనే లభ్యమయ్యేలా చేసేందుకు ఎంఎస్ఎన్ గ్రూప్ చేసే ప్రయత్నాలకు నిదర్శనంగా నిలుస్తుంది.