క‌న్నుల విందుగా మిసెస్ మామ్స్ సీజ‌న్ 6

హైటెక్స్ లో నిర్వహించిన మిసెస్ మామ్స్ కార్య‌క్ర‌మాన్ని మంత్రి హారీష్‌రావు, కిమ్స్ హాస్పిట‌ల్స్ ఎండీ డాక్ట‌ర్ భాస్క‌ర్ రావు, సిఇఓ డా. అభిన‌య్‌, డాక్ట‌ర్ శిల్పిరెడ్డి, డా. సుధీర్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ సృష్టి కర్త బ్రహ్మ అంటారు.. బ్రహ్మ మనకు కనిపించనీ దైవం. అయితే శిశువుకు జన్మ ఇచ్చే తల్లి మనకు కనిపించే దైవం

*డాక్టర్ శిల్పా రెడ్డి గారు చేనేతకు సహకారం అందించడం, సమ్మిళిత వృద్ది లక్ష్యాలు నెరవేరే దిశగా కృషి చేయడం, సి సెక్షన్లు తగ్గించడం వంటి మంచి ఆశయంతో మిసెస్ మామ్ కార్యక్రమం చేయడం మంచి విషయం

  • గర్భంతో ఉన్నప్పుడు హార్మోన్ల ప్రభావం వల్ల మానసికంగా, శారీరకంగా ఆనేక మార్పులు కలుగుతుంటాయి. వీటిపై సరైన అవగాహన లేక ఎంతోమంది మహిళలు ఆందోళన చెందుతుంటారు. వారికి సాయం చేసేలా డాక్టర్ శిల్పా రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో భర్తలను భాగస్వాములను చేయడం చాలా ఆసక్తిగా అనిపించింది.
  • గర్భిణిగా ఉన్న సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం, యోగా వంటివి చేయడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.
  • దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. పోషకాహారం అందిస్తూ, క్రమం తప్పకుండా ANC చెకప్ చేయిస్తున్నాం. యోగా సాధన చేయిస్తున్నాము.
  • అన్నింటికన్నా ముఖ్యమైంది నార్మల్ డెలివరీ. అనవసర సిజేరియన్ ల వల్ల భవిష్యత్తులో తల్లికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
  • సహజ ప్రసవాలు దేవుడు ఇచ్చిన వరం. తల్లి బిడ్డ మంచి ఆరోగ్యానికి ఇవి దోహదం చేస్తాయి. అయితే మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు ఇలా అనేక కారణాలవల్ల సహజ ప్రసవాలు తగ్గి సి సి సెక్షన్లు పెరిగాయి. సాధారణ ప్రసవాలు సహజంగా జరిగేవి. దేవుడిచ్చిన వరం. అయితే వాటి కోసం కోసం కూడా ప్రత్యేక చికిత్స తీసుకోవాల్సిన రోజులు వచ్చాయి.
  • మా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచే లక్ష్యంతో ఎంతో కృషి చేస్తున్నాం. అవగాహన పెంచడం, అనవసర సి సెక్షన్ల వల్ల కలిగే నష్టాలు వివరించడం, ఇలా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం.
  • ఒక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే కాదు, ప్రైవేటు లోనూ తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో జిల్లాలకు వెళ్ళినపుడు మీటింగ్ లు ఏర్పాటు చేసి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాను.
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో 44 శాతం, ప్రైవేటులో
    77 శాతం సి సెక్షన్లు జరుగుతున్నాయి. ప్రైవేటులో సి సెక్షన్లు తగ్గించాల్సిన అవసరం ఉంది.ఇది అందరి బాధ్యత.

అయిదు మెట్రోలు ఉన్న ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి చెప్పారు. తన చెల్లి యొక్క డెలివరీ కోసం హైదారాబాద్ వచ్చా అని చెప్పారు. ఆమెను చూడడానికి వచ్చాను అని చెప్పారు.

*అంత మంచి వైద్య సేవలు ఇక్కడ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నాయి.

*వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణ జిల్లాలకు వచ్చి ఇక్కడ డెలివరీలు చేసుకుంటున్నారు. ఇలా గత ఆరు నెలల్లో 8300 మంది డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యాయి.

*ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, కర్ణాటక నుండి సరిహద్దు ప్రజలు మంచి వైద్యం కోసం ఇక్కడకు వస్తున్నారు.