హైద‌రాబాద్‌లో నేడు రాహుల్ పాద‌యాత్ర‌

రాహుల్ గాంధీ పాదయాత్ర శంషాబాద్ తొండుపల్లి జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రారంభమై ఉ.10 గంటలకు హైదరాబాద్లోని బహదూర్ పురకు చేరుకోనుంది.సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.అక్కడి నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. ఇందిరాగాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతారు. రాత్రి బోయినపల్లిలో విశ్రాంతి తీసుకోనున్నారు.