ఘ‌నంగా హోమ్ 360 వార్షికోత్స‌వాలు

హోమ్ 360 డిగ్రీ ఐదో వార్షికోత్సవం జూబ్లీహిల్స్ రోడ్ నెం.40లోని వారి అత్యాధునిక షోరూంలో ఘనంగా జరిగింది. పెద్ద పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో సమాజంలోని పలువర్గాల ప్రముఖులు, పరిశ్రమ పెద్దలు పాల్గొన్నారు. శ్రీనాథ్ రాఠీ, శారద కె. కలిసి ప్రారంభించిన హోమ్ 360 డిగ్రీ విస్తృతశ్రేణిలో టైల్స్, బాత్రూం ఫిటింగులు, మాడ్యులర్ కిచెన్, వార్డ్ రోబ్ లు, వెల్ నెస్ లాంటి పలు అవసరాలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా పెద్దపెద్ద క్లయింట్ల నుంచి ప్రశంసలు అందుకుంది. క్లయింట్ల విభిన్న అభిరుచులకు అనుగుణంగా సంప్రదాయ అత్యాధునికతల మేలి కలియకతో ఇవన్నీ ఉంటాయి.

ఆ సమయంలో ప్రపంచాన్ని శాసిస్తున్న తాజా, అత్యంత విభిన్న డిజైన్లను ముంగిటకు తీసుకొచ్చే ప్రయత్నమే హోమ్ 360 లక్షO. ఈ వ్యాపార సూత్రానికి అనుగుణంగా, హోమ్ 360 తన ఐదో వార్షికోత్సవం సందర్భంగా దక్షిణ భారతదేశంలో గ్లోబల్ లీడర్ నెక్సియాన్ ను ప్రవేశపెట్టింది. నెక్సియన్ ‘ఫినిషింగ్స్’లో కొత్త శ్రేణిని ఆవిష్కరించింది.

తన వ్యాపార అసోసియేట్లు, క్లయింట్లకు ఐదో మైలురాయిని ఘనంగా చాటేందుకు సీఈవో, నెక్సియన్ ప్రమోటర్లలో ఒకరైన లూకా మజోచి ఇటలీ నుంచి నగరానికి వచ్చారు. “న్యూ ట్రెండ్స్ ఇన్ సర్ఫేస్ డిజైన్: వై కాపీ వెన్ వుయ్ కెన్ క్రియేట్’’ అనే అంశంపై ప్రసంగించేందుకే ఆయన ప్రత్యేకంగా విచ్చేశారు.

నెక్సియాన్ బ్రాండ్ పరిణామం, ఎదుగుదలను ప్రస్తావిస్తూ, తమ తమ మార్కెట్లలో అగ్రగాములుగా ఉన్న రెండు పెద్ద కుటుంబ సమూహాలను ఏకం చేయడమే బహుళజాతి సిరామిక్ కంపెనీ అని మజోజి చెప్పారు. ఈ రెండింటిలో ఒకటి ఇటాలియన్ దిగ్గజం సెరామికే స్పెరంజా. 1961 నుంచి తమ రంగంలో అత్యుత్తమమైనది. రెండోది 1977 నుంచి భారతదేశంలో సిరామిక్స్, శానిటరీ వేర్ లో అగ్రగామిగా ఉన్న అఘరా కుటుంబం.

ఇటాలియన్ విభాగం మోర్బిలో అత్యాధునిక తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీ 9 మిల్లీమీటర్ల విభాగంలో అధిక నాణ్యత కలిగిన సింటర్డ్ స్టోన్ శ్లాబులను డిజైన్, తయారీ, మరియు ఎగుమతి చేస్తుంది. ఇది టైల్స్ లో తాజా, అత్యంత శక్తివంతమైన సెగ్మెంటు. పాలరాయి, రాయి, కలప, కాంక్రీట్ లాంటి సహజ, కృత్రిమ ఉపరితలాలను పోలి, సుందరంగా డిజైన్ చేసిన మెరుగైన టైల్స్ ని రూపొందించడానికి కొత్తతరం ప్రెస్ టెక్నాలజీ, అధునాతన డిజిటల్ ప్రింటింగ్, గ్లేజింగ్ ఉపయోగించి ఈ ఉత్పత్తులను తయారుచేస్తారు.

‘ఇంటర్నేషనల్ డ్రీమర్స్ ను ప్రేరేపించడానికి ఇటలీలో డిజైన్ చేసినది’ అనే ప్రమోషనల్ నినాదంతో నడిచే, అన్ని విలాసవంతమైన నెక్సియాన్ ఉత్పత్తుల డిజైనింగ్ ఇటలీలోనే అయ్యింది. మోర్బీలోని అత్యాధునిక ప్లాంటులో వీటిని భారతదేశంలో తయారుచేస్తారు. అన్ని చౌకైన ఉత్పత్తులకు నాణ్యత ధృవీకరించారు. వీటన్నింటికీ ముందుగా ఇటాలియన్ ప్రయోగశాలలలో కఠినమైన పరీక్షలు చేసి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఖరారు చేసిన తర్వాతే విడుదల చేశామని శ్రీనాథ్ రాఠి చెప్పారు.

నిరంతరం అంతర్జాతీయ శ్రేణి ఉత్పత్తులతో ముందుకు రావడానికి సహకారం, బలమైన సాంకేతిక పరిజ్ఞానంతో అమ్మకాల అనంతర సర్వీసు కూడా అందిస్తున్నామని సహ ప్రమోటర్ శారద కె. తెలిపారు. వినియోగదారుల ఆకాంక్షలకు విలువతో సరిపోయే ఉత్తమ ఫలితాలను అందించడానికి ఇవే సహాయపడుతున్నాయని ఆమె చెప్పారు.

నెక్సియన్ నుంచి సుశిక్షితులైన సిబ్బంది, వారి భారతీయ ప్రముఖ డీలర్ హోమ్ 360 సిబ్బందితో కలిసి పనిచేస్తున్నారు. వీరంతా కలిసి ఆచరణీయమైన సంబంధాలు, సహకారాలను నిర్మించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.