మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్న జేపీ
అత్యున్నత పదివికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చారు జేపీ అదే జయప్రకాష్ నారాయణ్. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఏపీ నుంచి పార్లమెంట్‌కి పోటీ చేయాలని లోక్‌సత్తా పార్టీలో తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక మార్పులకు ప్రజలు సిద్ధం కావాలని లోక్‌సత్తా పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) తదితరులు పాల్గొన్నారు. ఏపీ నుంచి జేపీ పార్లమెంట్‌కు పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. విభజన హామీల సాధనకు ఏపీ నుంచి ఆయన పోటీకి దిగాలని తీర్మానంలో పార్టీ కార్యవర్గం పేర్కొంది. మరోవైపు కలసివచ్చేవారితో కొత్త రాజకీయ వేదిక నిర్మిస్తామని లోక్‌సత్తా తెలిపింది.