రాయదుర్గంలో రాఘవ ప్రాజెక్ట్స్ ఐరిస్
హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన రాయదుర్గంలో తొలి లగ్జరీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది రాఘవ ప్రాజెక్ట్స్. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి వెళ్లే ప్రధాన రహదారిలో కిమ్స్ ఆసుపత్రికి సమీపంలో 7.38 ఎకరాలలో ఐరిస్ పేరిట అద్భుతమైన వెంచర్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 5న విజయ దశమి సందర్భంగా భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం మూడు టవర్లు, ఒక్కోటి 45 అంతస్తులలో ఉంటుంది. ఒక్కో టవర్‌లో 180 ఫ్లాట్లుంటాయి. ఫ్లోర్‌కు కేవలం నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 520 యూనిట్లుంటాయి. ప్రతి ఫ్లాట్‌కు ప్రత్యేకంగా పనిమనిషి గది ఉంటుంది. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారులు విశాలమైన ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో.. ఈ ప్రాజెక్ట్‌లోని ఒక్కో ఫ్లాట్ 5,500 చదరపు అడుగుల నుంచి 6,600 చదరపు అడుగుల మధ్య ఉండేలా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి మలక చెరువు, దుర్గం చెరువు వ్యూ లొకేషన్‌లో ఉంటుంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లిహిల్స్ వంటి హైపర్ లొకేషన్లకు కేవలం 5 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నుంచి నిర్మాణ అనుమతులు కూడా వచ్చాయని, తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా)లోనూ ప్రాజెక్ట్‌ను నమోదు చేశామని నిర్మాణ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచింగ్ చేస్తామని చెప్పారు.