న‌వంబ‌ర్‌లో మునుగోడు ఎన్నిక‌లు

మునుగోడు ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేటి నుంచి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని క‌లెక్ట‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

మునుగోడు ఉప ఎన్నిక‌కు న‌వంబ‌ర్ 3వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 7వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 14. నామినేష‌న్ల‌ను 15వ తేదీన ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 17. న‌వంబ‌ర్ 3వ తేదీన ఎన్నికలు నిర్వ‌హించి, 6న ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.