త్రూపాన్ టోల్‌గేట్ వద్ద అక్రమ వసూల్ దందా
రాత్రి పడిందంటే చాలు ఆ జాతీయ రహదారి మీద వెళ్లాలంటే జంకుతున్నారు. ఎందుకంటే ఏకంగా టోల్‌గేట్ వద్ద దర్జాగా పోలీస్ వాహనం అడ్డుపెట్టుకొని మరీ దోచుకుంటున్నారు. ఇది అంతా ఎక్కడో బీహార్, ఒరిస్సా కాదు. మన మెదక్ జిల్లాలోని తూప్రాన్ టోల్‌గేట్ వద్ద జరుగుతున్న పైసా వసూల్ దందా. వారిని ప్రశ్నిస్తే… తమకు పోలీసులు అనుమతి ఉందంటూ బెదరింపులకు గురి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే….
దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి హైదరాబాద్ నుండి కాశ్మీర్ వెళ్లే వారికి మొదట వచ్చే టోల్‌గేట్ ఇది. అయితే ఇక్కడ రాత్రి అయింది అంటే చాలు.. టోల్‌గేట్‌కి వంద గజాల దూరంలో బారీ టార్చిలైట్లు పట్టుకొని నిలబడి లారీలు, ట్రక్కులు, ఇతర భారీ వాహాన డ్రైవర్లుకు సూటిగా లైట్లు వేసి ఆపుతారు. తాము ఇచ్చే… రేడియం స్టిక్కర్లు మీ వాహానాలకు వేసుకోవాలి. ప్రమదాలు జరగకుండా ఉంటాయి. ఇది పోలీసుల హెచ్చరిక అని సదరు డ్రైవర్లకు చెబుతారు. దీంతో కనుచూపు మేరల్లో పోలీస్ వాహనం కనిపిస్తుంది. ఇది నిజమే కావచ్చు అని ఆయా డ్రైవర్ల నుండి అందిన కాడికి దోచేస్తారు. ఇది నిలదీసిన ఓ మీడియా ప్రతినిధులకు నివ్వెర పోయన సమాధానాలు వచ్చాయి. తమకు పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి ఉందని బెదిరించారు. ఈ అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.