5 రోజుల ఉత్సవ్ దుర్గా పూజ ప్రసాదం కోసం 25 లీటర్ల ఫామ్ – టు- ఫ్రెష్ నెయ్యినిసరఫరా చేయనున్నకంట్రీ డిలైట్
హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్లో
5 రోజుల (30 సెప్టెంబర్ – 5 అక్టోబర్) దుర్గా పూజ
దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న నేచురల్ ఫుడ్ బ్రాండ్ అయిన కంట్రీ డిలైట్ ఫుడ్ స్పాన్సర్ గా ‘ఉత్సవ్’తో కలసి పని చేయనుంది. హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ లోజరుగుతున్న5 రోజుల (30 సెప్టెంబర్ – 5 అక్టోబర్) దుర్గపూజలోకంట్రీ డిలైట్కంపెనీ ప్రసాదం కోసం 25 లీటర్ల ఫామ్ – టు- ఫ్రెష్ నెయ్యిని సరఫరా చేయనుంది. ఈ ఉత్పాదనలో ఎలాంటి కల్తీ ఉండదని కంట్రీ డిలైట్ హామీ ఇస్తోంది. ఈ ఉత్పాదన 100% స్వచ్ఛమైన ఆవుపాలతో తయారై దేశీ నెయ్యి సువాసనను కలిగిఉంటుంది.
ఈ సందర్భంగా కంట్రీ డిలైట్ వ్యవస్థాపకులు, సీఈఓ చక్రధర్ గాదె మాట్లాడుతూ, ‘‘ఈ ఏడాది దుర్గా పూజ వేడుకలో భాగమవుతున్నందుకు మేం ఆనందిస్తున్నాం. స్వచ్ఛత, శక్తి అనేవి ఈ వేడుకతో ముడిపడి ఉన్నాయి. ప్రసాదం ఎల్లప్పుడూ తాజా, అసలైన ఉత్పాదనలతో తయారు చేయాలి. మా ఆవు పాల నెయ్యి ప్రసాదం తయారీకి వినియోగించబడడం మాకెంతో ఆనందదాయకం. కంట్రీ డిలైట్ మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తోంది’’ అని అన్నారు.
ఉత్సవ్ దుర్గా పూజ అనేది సంతోషం, అనుభూతులను పంచుకునేందుకు ఏర్పాటు చేయబడిన ఒక సాంస్కృతిక వేదిక. హైదరాబాద్ అత్యంత ఘనంగా దుర్గాపూజ వేడుకలు నిర్వహించడం ఇదే మొదటిసారి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాన్ని ఈ సందర్భంగా 50 వేల మంది సందర్శించనున్నారు. ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సుమన్ చక్రవర్తి, వైస్ ప్రెసిడెంట్ – అరిజిత్ సర్కెర్, జాయింట్ సెక్రటరీ – ఇంద్రనీల్ ఆదిత్య, తపస్ మాథుర్, కార్యదర్శి -కృష్ణేందు రాయ్ లాంటి వారు ఉత్సవ్ కమిటీ కీలక సభ్యులుగా ఉన్నారు.
ఈ సందర్భంగా ఉత్సవ్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ‘‘ఉత్సవ్ అనేది హైదరాబాద్ లో జరుగుతున్నమొదటి, ఏకైక దుర్గాపూజ ఉత్సవం. అత్యంత నాణ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఇది నిర్వహిస్తోంది. సాంకేతిక నేపథ్యం ఉన్న వారెందరో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సంతోషాన్ని పంచుకోవడం, సంస్కృతి, వారసత్వాల ద్వారా ప్రజలు స్నేహం, సామరస్యాలను అనుభూతి చెంది ఆనందించేలా చేయడం ఉత్సవ్ లక్ష్యం’’ అని అన్నారు.