వాల్తేర్‌లో కిమ్స్ ఐకాన్ 3కె వాక్
- కిమ్స్ ఐకాన్ ఆధ్వర్యంలో 3 కి.మీ వాక్
- యువతలో పెరుగుతున్న హృద్రోగ సమస్యలు
- అప్రమత్తమే ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చిన్న వయసులోనే అధికంగా గుండె జబ్బుల బారీన పడుతున్నారని అన్నారు కిమ్స్ ఐకాన్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ రాజు మరియు యూనిట్ హెడ్ జి. సుఖేష్‌రెడ్డి . అంతర్జాతీయ హృదయ (వరల్డ్ హార్ట్ డే) సందర్భంగా గురువారం 3కే వాక్ నిర్వహించారు. ఈ వాక్‌ని పాల్గొనడానికి ముఖ్య అతిధులుగా గాజువాక ఏడీసీపీ గంగాధరం, ట్రాఫిక్ ఏసీపీ ఎస్. రాజ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ రెడ్డి, సిఐ ఎల్. భాస్కర్‌లు హాజరై ఈ వాక్‌ని ప్రారంభించారు. గాజువాక సెంటర్ నుండి విశాఖ డైరీ వరకు ఈ వాక్ సాగింది. ఈ సందర్భంగా కిమ్స్ ఐకాన్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ రాజు యరియు జి. సుఖేష్‌రెడ్డి మాట్లాడారు.
” మారుతున్న జీవిన శైలిలో భాగంగా చిన్న వయసులో ఎక్కువగా గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా యువత ఇటీవల కాలంలో జిమ్‌లో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. అదే వారికి ఇబ్బందులకు గురి చేస్తోంది. నిత్యం వ్యాయామం, జిమ్ చేయడమే ఉత్తమము కానీ మితంగా ఉండాలి. ఇటీవల కాలంలో అధికంగా జిమ్ చేయడం వల్ల ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు మరణించారు. కాబట్టి యువత గుండె జబ్బులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇటీవల గమణించిన కేసులలో అధికంగా గుండె సంబంధిత వ్యాధులతో వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా ఒత్తిడి కూడా గుండె సమస్యలకు ప్రధాన కారణంగా మారింది. ఉద్యోగరీత్యా ఒత్తిడితో పని చేయడం వల్ల కూడా ఈ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇది భవిష్యత్తును ఇబ్బంది పెట్టే తరుణం అని చెప్పుకోవాలి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి శారీరక శ్రమను దూరం పెడుతున్నారు. ఉదయం లేవగానే వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. ముఖ్యంగా శరీరంలో పేరుకపోయిన కొవ్వును కరిగించాలంటే నిత్యం తప్పకుండా వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. జన్యపరమైన కారణాలు, ఆహారపు అలవాట్ల వల్ల చిన్నపిల్లలో అధికంగా గుండె సమస్యలు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధులను ముందుగా గుర్తిస్తే… వాటిని అరికట్టే అవకాశం ఉంటుంది.” ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం వైద్యులు, డాక్టర్. గౌరీశంకర్ రెడ్డి, డాక్టర్. కె. నారాయణ రాజు, డాక్టర్. సాయిమణి కందన్, డాక్టర్. శాంతి ప్రియ, డాక్టర్ వాసుబాబు దావాల, డాక్టర్. రవీంద్ర దేవ్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.