శ్రీవారి స్నపనం కోసం జపాన్ ఆపిల్స్ – మస్కట్ గ్రేప్స్ – కొరియన్ పియర్స్

– ప్రత్యేక అలంకరణకు ఒక టన్ను కట్ ఫ్లవర్స్ మరియు పండ్లు

దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా నుండి పియర్స్, థాయిలాండ్ నుండి మామిడి మరియు అమెరికా నుండి చెర్రీస్ కూడా స్వామివారి సేవలో తరించాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో వేలాది కిలోమీటర్ల లోని తమ స్వస్థలాల నుండి ఈ పండ్లు, పుష్పాలను స్వామివారికి సమర్పించారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ గార్డెన్ విభాగం ప్రత్యేక అలంకరణలు చేసింది. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామివారికి రూపొందించారు.