తెర వెననుక తెరాస విలీనం కథ
మీరు చదివిన లైన్ ముమ్మాటికీ నిజమే అంటున్నారు రాజకీయ వేత్తలు. ఇటీవల కాలంలో తెరాస అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దూసుకపోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇందుకు గత కొన్ని సంవత్సరాలుగా అనేక దఫాలుగా ఇతర రాష్ట్రాల నేతలో చర్చలు జరిపారు. అయితే కొంత మంది సానుకూలంగా స్పందించిన తెర వెనుక మాత్రం ఎందుకు వచ్చిన ఇబ్బంది అని లైట్ తీసుకున్నారు. కాగా ఇప్పుడు రాజకీయం చాలా రసవత్తరంగా మారింది. కేంద్రం ప్రభుత్వం, ప్రధాని మోడీని టార్గెట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు చల్లబడ్డాడు అని చెప్పుకోవాలి. దీనికి కారణాలు అందరికీ తెలుసు. ప్రధానంగా కేటీఆర్ మీద ఫీనిక్స్ కుంభకోణం, కాళేశ్వరం, కూతరు కవిత మీద ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో పాటు అల్లుడు, హారీష్‌రావు, మరో కొడుకులాంటి సంతోష్ రావులు ఇలా ఇంటి సభ్యులతో పాటు పార్టీలో కూడా అనేక మంది మీద అవినీతి అరోపణలు మల్లెతీగలాగా అల్లుకున్నాయి. వీటన్నింటి నుండి తప్పించుకోవాని మళ్లీ మూడోసారి అధికారంలోకి రావాలంటే కత్తి మీద సాము లాంటిదే. సుధీర్ఘ ఆలోచన తరువాత తెర వెనుక తెరాస విలీనం అనే చర్చ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నాయకుల మధ్య జరుగుతున్న చర్చ.
తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ పార్టీని అనేక సార్లు తన నోటికి వచ్చినట్లు తిట్టాడు. ఇది గతం కానీ ఇప్పుడు మాత్రం ఆ పార్టీతోనే జాతీయ రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. ఆ పార్టీ అండతో ముందుకు వెళ్లాలని.. కొడుకును కేటీఆర్‌కి రాష్ట్రం అప్పజెప్పి తాను దేశ రాజకీయాలు చూసుకుంటున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జాతీయ రాజకీయాలను మలుపుతిప్పాలంటే… ఒక్కడిగా మరొకరి తొడుగా సొంతగా నెట్టుకు రావాలంటే కష్టమని అర్ధమైనట్టుంది సీఎం కేసీఆర్‌కి. ఇక ప్లాన్ చేంజ్ చేసి కాంగ్రెస్ తొడుగా వెళ్తే తప్పా… రాజకీయ మనుగడ కష్టమని తెలిపోయిందని అంటున్నారు.
ఇక సొంత కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి అరోపణలకు కూడా చెక్ పెట్టాలంటే…. ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎటు గాంధీ కుటుంబం ప్రధాని పదివి తీసుకోక పోవడం కలిసి వచ్చే అవకాశం. తెలంగాణ ఇచ్చిన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడింది. అధికారంలోకి వస్తామని ఆశించిన కమళం పార్టీకి ఆదిలోనే భంగపడ్డారు.
అయితే ఇప్పుడు నిజంగా తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే… ప్రధానికిగా కేసీఆర్ అవయం సాధ్యా ఆసాధ్యాలపై జరుగుతున్నాయి. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగిన పార్టీలో ముందుచూపు ఆలోచన లేకుండా కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఎంత వరకు లాభిస్తోందని అనేది ఇప్పుడు చర్చ.
అయితే ఈ చర్చలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచి చూద్దాం. మరింత విశ్వసనీయ సమచారంతో మరో కథనం అతి త్వరలో అప్పటి వేచి ఉందాం మనం కూడా.