మాజీ ఎంపీ గీత అరెస్ట్‌

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నమోదు చేసిన సెక్యూరిటీ మోసం కేసులో సీబీఐ బుధవారం ఆమెను అరెస్టు చేసింది. ఆమె భర్త పీఆర్‌కే రావు విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో రూ.50 కోట్ల రుణం తీసుకున్నారని పీఎన్‌బీ పేర్కొంది. ఈ రుణానికి అప్పట్లో వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఉన్న గీత గ్యారెంటర్‌గా ఉన్నారు. పీఎన్‌బీకి రావు జారీ చేసిన రూ.25 కోట్ల చెక్కు బౌన్స్ అయింది. గీత, రావులపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. సిబిఐ అధికారులు గీతను వైద్య పరీక్షల నిమిత్తం ఆమె నివాసం నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. గీతతో పాటు ఆమె భర్తకు ఐదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు ఆమె లాయర్లు తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వైకాపా నుండి వీడిన త‌రువాత ఆమె 2018లో జన జాగృతి పార్టీ అనే కొత్త రాజకీయ సంస్థను ప్రారంభించింది. తర్వాత, గీత తన పార్టీని భార‌తీయ జ‌న‌తా పార్టీలో విలీనం చేసింది.