లైవ్ షాపింగ్ అనుభూతిని అందించనున్నషాపిఫై, యూట్యూబ్
భారతీయ వ్యాపారులకు
రేపటి తరం లైవ్ షాపింగ్ అనుభూతిని అందించనున్నషాపిఫై, యూట్యూబ్
వినియోగదారులతో అనుసంధానం కావడంలో వ్యాపారులకు తోడ్పడుతున్న షాపిఫై
రెండు బిలియన్ల మంది యూట్యూబ్ మంత్లీ యాక్టివ్ యూజర్లను బ్రాండ్లు చేరుకోగల అవకాశం
వ్యాపార ఆవశ్యక ఇంటర్నెట్ మౌలిక వసతులను అందించే అగ్రగామి సంస్థ అయిన షాపిఫై నేడిక్కడ యూట్యూబ్ షాపింగ్ ను ప్రపంచవ్యాప్తంగా తమ లక్షలాది వ్యాపారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. విశ్వసనీయ, నాణ్యమైన కంటెంట్ ను వినియోగదారులతో అనుసంధానమయ్యేందుకు, తమ బ్రాండ్లను నిర్మించుకునేందుకు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు క్రియేటర్లు ఉపయోగించుకునేందుకు శక్తి వంతమైన నూతన అవకాశాన్ని ప్రారంభించింది.
తిరుగులేని షాపింగ్ అనుభూతిని అందించేందుకు వీలుగా యూట్యూబ్ ప్లాట్ ఫామ్ పై తమ వీక్షకులతో నేరుగా అనుసంధానమయ్యే శక్తిని కంటెంట్ క్రియేటర్లు, వ్యాపారులు కలిగిఉంటారు. విజయవంతంగా వారు తమ వ్యాపారాలను నిర్మించుకోగలుగుతారు.
ప్రపంచపు రెండో అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫామ్, సెర్చ్ ఇంజిన్ గా యూట్యూబ్ ఆయా ఉత్పాదనలను ఆన్ లైన్ లో ఇళ్ల వద్దనే అన్వేషించే, సమీక్షించుకునే సౌలభ్యాన్ని అందిస్తోంది. విశ్వసనీయ మార్గదర్శకత్వంతో కూడిన ఇన్ స్టోర్ అనుభూతితో కూడా. తాము విశ్వసించదగిన సిఫారసులనే యూట్యూబ్ క్రియేటర్లు చేస్తారని సుమారుగా 90% మంది వీక్షకులు నమ్ముతున్నారు. యూట్యూబ్ పై షాపింగ్ లేదా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు తాము అత్యధిక నాణ్యమైన సమాచారాన్ని పొందుతున్నట్లుగా పలువురు (87%) చెబుతున్నారు.
భారతీయ వినియోగదారుల్లో సగం కంటే ఎక్కువ మంది (56%) వినోదాత్మక వీడియోలతో పాటుగా బ్రాండ్ క్రియేటెడ్ కంటెంట్ తో అనుసంధానం కాగలరని షాపిఫై అధ్యయనం వెల్లడిస్తోంది. సుమారుగా ప్రతీ ఇద్దరిలో ఒకరు ఈ ఏడాది ఓ షాపింగ్ ఈవెంట్ కు హాజరు కాగలరని భావిస్తోంది- 2021 లో ఇలా చేసిన వారి సంఖ్య (23%)కు రెట్టింపుగా.
షాపిఫై వ్యాపారులు యూట్యూబ్ యొక్క రెండు బిలియన్ల మంత్లీ వినియోగదారులకు యూట్యూబ్ లైవ్, షార్ట్స్, వీఓడీ కంటెంట్ ద్వారా మూడు విధాలుగా తమ ఉత్పాదనలను విక్రయించవచ్చు.
లైవ్ స్ట్రీమ్స్ వ్యాపారులు ఓ లైవ్ స్ట్రీమ్, పిక్చర్ ఇన్ పిక్చర్ ప్లే బ్యాక్ వద్ద తమ ఉత్పాదనలను ట్యాగ్ మరియు పిన్ చేయవచ్చు. అంటే వినియోగదారులు తాము చెకవుట్ చేసే సమయంలోనూ చూడ వచ్చు.
వీడియోలు: వ్యాపారులు ఆన్ -డిమాండ్ వీడియోల కింద ప్రోడక్ట్ షెల్ఫ్ లో తమ ఉత్పాదనల క్యూరేటెడ్ లిస్ట్ ను ప్రదర్శించవచ్చు.
స్టోర్ ట్యాబ్: మర్చంట్ యూట్యూబ్ చానల్ కు ఒక కొత్త ట్యాబ్ జోడించబడుతుంది. అందులో వారు తమ యావత్ ఉత్పాదనల ఎంపికను ప్రదర్శించవచ్చు.
ఈ సందర్భంగా షాపిఫై డైరెక్టర్, కంట్రీ హెడ్ ఇండియా భారతి బాలకృష్ణన్ మాట్లాడుతూ, ‘‘వినియోగ దారులు తమ సమయం ఎక్కడ వెచ్చిస్తారో అదే వారు డబ్బు వెచ్చించేది కూడా. యూట్యూబ్ తో షాపిఫై భాగస్వామ్యం భారతీయ వ్యాపారులకు వారు తమ భారతీయ మరియు ప్రపంచవ్యాప్త వినియోగ దారులను చేరుకునేందుకు నూతన, ఎంగేజింగ్ వీడియో కంటెంట్ తో కొత్త అవకాశాలను అందిస్తోంది. భారతదేశంలో అత్యంత ప్రభావపూరిత చానల్స్ లో ఒకటిగా యూట్యూబ్ ఉంటోంది. దానితో షాపిఫై ను సమ్మిళితం చేయడం భారతదేశవ్యాప్తంగా ఇండిపెండెంట్ బ్రాండ్లకు గొప్ప అవకాశాలను అందించినట్లు కాగలదు. గూగుల్ తో మా దీర్ఘకాలిక అనుబంధాన్నియూట్యూబ్ పై డి2సి కామర్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విస్తరించడం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.
షాపిఫై వ్యాపారుల రిటైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కు మరిన్ని శక్తులను జోడిస్తుంది. తిరుగులేని విధంగా అన్ని చానల్స్ లోనూ పేర్లు, ఇమేజ్ లు, ప్రైసింగ్, షిప్పింగ్ లతో సహా ప్రోడక్ట్ డిటేల్స్ సింకింగ్, అప్ డే టింగ్ చేస్తుంది. ఒక ఉత్పాదన విక్రయాలు ముగిసిపోతే, అది యూట్యూబ్ లో నుంచి ఆటోమేటిక్ గా తొలగించబడుతుంది. వ్యాపారులు లైవ్, ఆన్ డిమాండ్ వీడియోల పనితీరును నేరుగా తమ షాపిఫై అడ్మిన్ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. మల్టీచానల్ సేల్స్ పూర్తి వ్యూ పొందవచ్చు.
ఈ సందర్భంగా ఈ భాగస్వామ్యంపై యూట్యూబ్ షాపింగ్ ప్రోడక్ట్ వీపీ డేవిడ్ కాట్స్ మాట్లాడుతూ, ‘‘ఏళ్లుగా క్రియేటర్లు తమ యూట్యూబ్ కంటెంట్ చుట్టూరా వ్యాపారాలను నిర్మించుకుంటున్నారు. తర చూ వారు తమ సొంత బ్రాండ్లకు చేసుకుంటూ ఉంటారు. యూట్యూబ్ లో వారి ఉత్పాదనలు నేరుగా వినియోగదారులను చేరుకుంటాయి. క్రియేటర్లు సులభంగా తమ స్టోర్స్ ను తీసుకువచ్చేందుకు సహా యం చేసేందుకు షాపిఫై తో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు షాపిఫై వ్యాపారులకు యూట్యూబ్ షాపింగ్ అందుబాటులో ఉంది. యూ ట్యూబ్ షాపింగ్ గురించి మరింత తెలుసుకోగలరు here.