ధ‌రిప‌ల్లిలో సాయిప‌ల్ల‌వి బోనం

మెదక్ జిల్లాలోని ధ‌రిప‌ల్లి సాయి ప‌ల్ల‌వి బోనాల పండుగ‌ను నిర్వ‌హించింది. తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాల‌కు ప్ర‌తీకగా నిలిచిన బోనాల‌ను సాయి ప‌ల్ల‌వి గుర్తు చేసుకుంది. ఆషాడ మాసంలో హైదరాబాద్‌లో ప్ర‌త్యేకంగా బోనాల పండుగ‌ను నిర్వ‌హిస్తాయి. అయితే ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం ధ‌రిప‌ల్లి గ్రామంలో చిత్రీక‌ర‌ణ చేసుకుంది. సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా బోనాల ఉత్స‌వాల‌ను కూడా సినిమాలో ఒక భాగంగా తెర‌కెక్కించారు. కాగా ఆదివారం బోనాలు ఉత్స‌వాలు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ధ‌రిప‌ల్లిలో తీయించుకున్న చిత్రాన్ని షేర్ చేసి అభిమానుల‌కు, ధ‌రిప‌ల్లి ప్ర‌జ‌ల‌కు బోనాల శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు సాయి ప‌ల్ల‌వి.

సేక‌ర‌ణ
వినోద్ గౌడ్‌.