ఇవిట్రిక్ నుండి ఎల‌క్ట్రిక్ బైక్‌

ఇవిట్రిక్ మోటార్స్ – పిఏపిఎల్ చే పుణె-ఆధారిత ఎలెక్ట్రిక్ వెహికల్ తయారీ వెంచర్ తన ఎలెక్ట్రిక్ మోటర్ సైకిల్ ఇవిట్రిక్ రేస్‌ని ఆవిష్కరించింది.

ఈ బ్రాండుచే ఈ హై-స్పీడ్ మోటర్ సైకిల్ మొట్టమొదటి ఎలెక్ట్రిక్ మోటర్ సైకిల్ గా ఉంది, ఒక సొగసైన శైలిని మరియు హై-స్పీడ్ టెక్నాలజీని చాటి చెబుతోంది. ఇవిట్రిక్ మోటార్స్ టీము ఈ ఉత్పాదనను తమ డీలర్ల సమావేశం సందర్భంగా సిఖార్, రాజస్థాన్ యందు రు. 1,59,990 (ఎక్స్-షోరూమ్ ఇండియా) ధరతో ఆవిష్కరించింది. ఈ సమావేశములో మొత్తం రాజస్థాన్ లోని డీలర్ భాగస్వాములు అందరూ పాల్గొన్నారు మరియు బ్రాండుచే ఈ నూతన ఆవిష్కరణను వీక్షించారు.

ఈ బ్రాండు విద్యుత్ వాహన విభాగములో ‘భారత్-లో-తయారీ’ యొక్క అంతిమ దార్శనికతను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఎంతగానో ఎదురు చూసిన ఎలెక్ట్రిక్ బైక్ ఇవిట్రిక్ రేస్‌ గంటకు 70 కిలోమీటర్ల అత్యధిక వేగముతో ప్రయాణిస్తుంది మరియు ఒక సింగిల్ ఛార్జ్ తో సులభంగా 110 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. ఇది, 4 గంటల లోపున పూర్తిగా ఛార్జ్ అయ్యే లీథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఆటో కట్ ఫీచరుతో వెంట తోడుగా వచ్చే 10 ఆంప్ మైక్రో ఛార్జరుతో, వాడుకదారులు సౌకర్యంగా మరియు సురక్షితంగా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి ఈ బైక్ వీలు కలిగిస్తుంది.