చిత్తూరు లో ప్రారంభమైన రాయల్‌ ఓక్‌ రిటైల్‌ స్టోర్‌

భారతదేశపు సుప్రసిద్ధ ఫర్నిచర్‌ కంపెనీ రాయల్‌ ఓక్‌ నేడు చిత్తూరు లో తమ మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ను ప్రారంభించింది. తమ శ్రేణి సోఫా, రిక్లైనర్స్‌, డైనింగ్‌, ఎక్స్‌క్లూజివ్‌ మ్యాట్రెసస్‌, బెడ్స్‌, కుషన్‌, మొత్తం శ్రేణి ఆఫీస్‌, ఔట్‌ డోర్‌ ఫర్నిచర్‌తో భారతదేశపు మార్కెట్‌లో సుప్రసిద్ధ రిటైల్‌ బ్రాండ్‌గా నిలిచింది రాయల్‌ ఓక్‌. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా శ్రీ అరని శ్రీనివాసులు, ఎం ఎల్ ఏ చిత్తూర్ , శ్రీమతి ఎస్ ఆముద, మేయర్ చిత్తూర్ మరియు శ్రీ పురుషోత్తం రెడ్డి , చైర్మన్ చూడా పాల్గొన్నారు.

చిత్తూరు లో రాయల్‌ ఓక్‌ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ అరని శ్రీనివాసులు, ఎం ఎల్ ఏ చిత్తూర్ , మాట్లాడుతూ ‘‘ఈ స్టోర్‌లో ఇంపోర్టెడ్‌ ఫర్నిచర్‌ను ప్రదర్శిస్తున్నారు. శైలి , సౌకర్యంల ఖచ్చితమైన సమ్మేళనంగా ఇది ఉంది. లివింగ్‌, డైనింగ్‌, బెడ్స్‌, ఆఫీస్‌, ఔట్‌డోర్‌ ఫర్నిచర్‌లో భారీ కలెక్షన్‌ ఇక్కడ అందుబాటులో ఉంచారు. అత్యుత్తమ ధరలలో విభిన్నశ్రేణి ఫర్నిచర్‌ ఇక్కడ లభించడం విశేషం’’ అని అన్నారు.

ఈ సందర్భంగా రాయల్‌ ఓక్‌ ఇన్‌కార్పోరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ విజయ్‌ సుబ్రమణియం మాట్లాడుతూ ‘‘విజయవాడలో మా స్టోర్‌ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము.ఈ స్టోర్‌ ద్వారా మా బ్రాండ్‌ అభిమానులకు విభిన్న శ్రేణి ఉత్పత్తులు, అంతర్జాతీయ శ్రేణి ఫర్నిచర్‌, హోమ్‌ యాక్ససరీలు మరియు మరెన్నో ఉత్పత్తులను దగ్గరగా చూసే వీలు అందిస్తున్నాము. భవిష్యత్‌లో ఈ తరహా మరిన్ని స్టోర్లను ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

రాయల్‌ఓక్‌ ఇన్‌కార్పోరేషన్‌ సీఈవొ వేణుగోపాల్‌ నాయర్‌ మాట్లాడుతూ ‘‘అనుభవపూర్వక షాపింగ్‌ మా లక్ష్యం. మా స్టోర్‌ను ఆ అనుభవాలను అందించే రీతిలో అతి జాగ్రత్తగా తీర్చిదిద్దాము’’అని అన్నారు.
రాయల్‌ ఓక్‌కు ఇప్పుడు 121 కు పైగా రిటైల్‌ ఔట్‌లెట్లు మరియు స్టాక్‌ పాయింట్స్‌ ఉన్నాయి. వ్యూహాత్మకంగా ఏర్పాటుచేసిన వేర్‌హౌస్‌లు కర్నాటక, తెలంగాణా, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా వంటి చోట్ల ఉన్నాయి