పార్వ‌తీపురం జిల్లా అధ్య‌క్షురాలిగా పాముల పుష్ప శ్రీవాణి

ప‌ద‌వులు వ‌స్తే గ‌ర్వం రాద‌ని, మ‌రింత బాధ్య‌త పెరుగుతుంద‌ని అన్నారు ఎమ్మెల్యే, పార్వ‌తీపురం జిల్లా వైకాపా అధ్యక్షురాలు పాముల పుష్ప శ్రీ‌వాణి. మంగ‌ళ‌వారం ఏపీలో అన్ని జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌ను నియ‌మించారు. ఈ మేర‌కు పార్వతీపురం జిల్లా అధ్య‌క్షురాలిగా ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీ‌వాణిని పార్టీ నియ‌మించింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌న మ‌రింత బాధ్య‌త పెట్టార‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఉప ముఖ్య‌మంత్రి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రిచిపోలేని సేవ‌లు అందించాన‌ని తెలిపారు. ఎవ‌రినికి ఏ స‌మ‌యంలో ఉప‌యోగించాలో జ‌గ‌న్నకి చాలా బాగా తెలుస‌న‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వంలో భాగ‌మైన‌న త‌న‌ని ఇక పార్టీలో క్రీయశీల పాత్ర పోషించ‌డానికి బాధ్య‌త అప్ప‌జెప్పార‌ని పేర్కొన్నారు. ఇక జిల్లాలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు.