ప్ర‌తి గింజా రాష్ట్ర‌మే కొంటుంది : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి పంట‌ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగొలు చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఇవాళ జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విలేక‌రులు వెల్ల‌డించారు. మంత్రివ‌ర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేబినెట్‌ నిర్ణయాలను వివరించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. క్వింటాల్‌ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.