కేసీఆర్, జగన్ ఇద్దరూ ఢిల్లీలోనే… ఏం జరుగుతోంది ?
తెలంగాణ, ఏపీ సీఎంలు ఇద్దరూ ఢిల్లీలో మాకం వేశారు. ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం ఆ వివరాలను ప్రధాని నరేంద్రమోడీకి వివరించడానికి ప్రధానితో భేటీ కానున్నారు సీఎం జగన్. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వ సమస్యల ఆయా శాఖలు, రాజకీయ పరిణామాలు చర్చిండానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లారు. అయితే వీరిద్దరూ ఒకేసారి ఢిల్లీ వెళ్లడం రాజకీయ ఆసక్తి నెలకొంది.
కొత్త జిల్లాల ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆంతే కాకుండా, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా ప్రధాని తో మాట్లాడతారని తెలిసింది. ఇదిలా ఉండగా, కొత్త జిల్లాలు ఏర్పాటు అనంతరం , మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణకు ముందు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పొలవరం ప్రాజెక్టు, పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై మోడితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, కేంద్ర మంత్రి అమిత్‌షాతోనూ సీఎం భేటీకి సీఎంవో అపాయింట్‌మెంట్ కోరింది.