హైదరాబాద్ లో ఇండియాగోల్డ్ ఇంటి వద్దనే గోల్డ్ లోన్ సేవలు



రాబోయే నెలల్లో తెలంగాణలోని ఇతర నగరాలకు సేవలు

సౌలభ్యం, ప్రైవసీ, భదత్ర లతో తమ ఇంటి వద్దనే గోల్డ్ లోన్ పొందే సదుపాయాన్ని అందించడం

ఈ ఫిన్ టెక్ కంపెనీ యొక్క డోర్ స్టెప్ గోల్డ్ లోన్ సర్వీస్ లక్ష్యం



హైదరాబాద్, ఫిబ్రవరి 2022: భారతీయులకు బంగారం అంటే ఎంతో మక్కువ. దాన్ని దృష్టిలో ఉంచుకొని, బంగారంపై రుణాలను అందించే ఫిన్ టెక్ స్టార్టప్ అయిన ఇండియా గోల్డ్ 2021 డిసెంబర్ లో హైదరాబాద్ లో డోర్ స్టెప్ గోల్డ్ లోన్ సర్వీస్ ను ప్రవేశపెట్టింది. ఈ సర్వీస్ ను ప్రారంభించిన ఈ రెండు నెలల్లోనే ఇది భారీ వృద్ధిని సాధించింది, సంస్థ నేడు హైదరాబాద్ లో శరవేగంగా వృద్ధి చెందుతున్న గోల్డ్ లోన్ కంపెనీగా ఎదిగినట్లుగా సంస్థ తెలిపింది.



డోర్ -టు-డోర్ సర్వీస్ లో భాగంగా కస్టమర్లు అత్యుత్తమ ఆఫర్ పొందేందుకు గాను ఎన్నో గోల్డ్ లోన్ కంపెనీలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సర్వీస్ కస్టమర్లకు సౌలభ్యం, ప్రైవసీ, భదత్ర లతో పాటుగా తమ ఇంటి వద్దనే గోల్డ్ లోన్ పొందే సదుపాయాన్ని అందిస్తుంది. బంగారంపై ఇండియా గోల్డ్ గరిష్ఠ రుణమొత్తాన్ని అందిస్తుంది. ఇతర గోల్డ్ లోన్ సంస్థలతో పోలిస్తే అతి తక్కువ వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది.

ఉపయోగించేందుకు సులభంగా ఉండే ఇండియా గోల్డ్ యాప్ తో వినియోగదారులు తమ నెలవారీ వడ్డీని తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సులభంగా చెల్లించవచ్చు, లోన్ క్లోజ్ చేసేందుకు లేదా కొంతభాగం విడిపిం చుకునేందుకు అభ్యర్థన పంపవచ్చు. ఏవిధమైన సహాయం కోసమైనా 24X7 కస్టమర్ సర్వీస్ ను కాంటాక్ట్

చేయవచ్చు.

ఈ విజయం సాధించిన సందర్భంగా ఇండియా గోల్డ్ సహ-వ్యవస్థాపకులు నితిన్ మిశ్రా మాట్లాడుతూ, ‘‘బంగారం సంబంధిత ఫైనాన్స్ లో డోర్ స్టెప్ డెలివరీ మోడల్ ఎంతో సంచలనం కలిగిస్తుందని మేం విశ్వసిస్తున్నాం. మా

విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్ లో ఈ సర్వీస్ ను మేం ప్రవేశపెట్టాం. అది మాకెంతో విజయాన్ని

అందించింది. భారతదేశానికి చెందిన శరవేగంగా వృద్ధి చెందుతున్న, అత్యంత వినూత్నదాయక గోల్డ్ లోన్ సర్వీస్ ను హైదరాబాద్ లో అందిస్తున్నందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాం. మనకు గల అత్యంత పెద్ద నగరాల్లో హైద రాబాద్ ఒకటి, దానికి తగ్గట్టుగానే మేం ఇక్కడ మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నాం. ఇలాంటి గొప్ప బాధ్యత అందించినందుకు కస్టమర్లకు మా ధన్యవాదాలు. వారికి అత్యుత్తమ ఉత్పాదనలు, సేవలు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.