ఫీజులు క‌ట్ట‌మ‌ని వేధిస్తున్న ఘ‌ట్‌కేస‌ర్ ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ యాజ‌మాన్యం

ఫీజులు క‌ట్ట‌మ‌ని ఘ‌ట్‌కేస‌ర్ ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ యాజ‌మాన్యం

క‌రోనా మ‌హ‌మ్మారి రెండు సంవ‌త్స‌రాలు విల‌య‌తాండ‌వం చేసి ఎంతో మందిని పొట్ట‌న పెట్టుకుంది. దీంతో ఎంతో మంది ఉపాధి కొల్పోయారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల ప‌రిస్థితి ఇక చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌తుకు జీవుడా అంటూ కాలం వెల్ల‌దీస్తున్నారు. క‌రోనా ఇప్పుడు కాస్తా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప్రైవేట్ స్కూల్లు మ‌ళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ త‌రుణంలో ఓ వైపు ఉపాధి కోల్పొయి బాధ‌లో ఉంటే పిల్ల‌ల స్కూల్ ఫీజులు క‌ట్టాల‌ని త‌ల్లిందండ్రుల మీద పాఠశాల యాజ‌మాన్యాలు ఒత్తిడి తీసుక‌వ‌స్తున్నాయి. వివ‌రాల్లోకి వెళ్తే…

ఘ‌ట్‌కేస‌ర్ ప‌ట్ట‌ణానికి చెందిన రాజేశ్వ‌ర్‌రెడ్డి త‌న ఇద్ద‌రి కూతుర్ల‌ను ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లో చ‌దివిస్తున్నారు. అయితే ఇటీవ‌లే తెరుచుకున్న స్కూల్ యాజ‌మాన్యం విద్యార్థుల త‌ల్లిదండ్రుల మీద ఫీజులు క‌ట్టాల‌ని ఒత్తిడి తీసుక‌వ‌స్తోంది. స్కూల్ ఫీజులు క‌డితే త‌ప్పా పాఠ‌శాల ఆవ‌ర‌ణంలోకి అనుమ‌తి ఇస్తామ‌ని బెదిరించారు. ఈ సంద‌ర్భంగా రాజేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ గ‌త రెండేళ్లుగా పాఠ‌శాల‌లు తెర‌వ‌కున్నా… ఆన్‌లైన్ క్లాస్‌లు చెప్పినా…. ఫీజ‌లు చెల్లించాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స‌మ‌యంలో ఫీజులు క‌ట్టాల‌ని ఒత్తిడి తీసుక‌రావ‌డం త‌గ‌ద‌ని వాపోయారు. అయినా కానీ యాజ‌మాన్యం ప‌ట్టించుకోలేదు. ఫీజులు క‌డితేనే ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రీక్ష‌లకు అనుమ‌తి ఇస్తామ‌ని మెండికేశారుని పేర్కొన్నారు. చిన్నారుల జీవితాల‌తో ఆడుకోవ‌ద్ద‌ని ఎంత మెర పెట్టుకున్న మాజ‌మాన్యం తగ్గ‌డం లేద‌న్నారు.

ఈ విష‌యంలో తీవ్ర‌మైన మ‌నోవేధ‌న‌కు గురైన రాజేశ్వ‌ర్‌రెడ్డి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఐటీ శాఖ‌, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్‌ల‌కు త‌మ‌కు న్యాయం చేయాల‌ని ట్వీట్ట‌ర్ ద్వారా ఫిర్యాధు చేశారు. వెంట‌నే స్పందించిన కేటీఆర్ కార్యాల‌య సిబ్బంది ఘ‌ట్‌కేస‌ర్ ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ త‌గిన చ‌ర్య‌లు తీసుకుమాని వెల్ల‌డించింది.