కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బతగిలింది. పార్టీ సీనియర్ నాయకులు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడనున్నారు. ఇది పార్టీకి పెద్ద లోటే అని చెప్పుకోవాలి. పార్టీలో బలమైన వ్యక్తి ముద్ర వేసుకున్న వ్యక్తి ఆయన. బహిరంగంగా అధికార పార్టీని నిలదీయగల శక్తి ఉన్న నాయకుడు. కానీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన నాటి నుండి అతను పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు. రేవంత్ రెడ్డిని పీసీసీ నుండి తొలగించానలి అధిష్టానానికి కూడా లేఖ రాశారు.
అయితే గత కొన్ని రోజులుగా అధికార పార్టీని విమర్శించడం పూర్తి మానేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా మెలిగారు. కాంగ్రెస్ పార్టీ వీడిన తరువాత జగ్గారెడ్డి తెరాసలోకి వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జగ్గారెడ్డి మాత్రం పార్టీ వీడిన తరువాత స్వతంత్రంగా ఉంటానని చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది.
ఇవాళ పార్టీ అదిష్టానానికి తన రాజీనామా లేఖ పంపనున్నారు. రాజీనామాకు గల కారణాలను కూడా లేఖలో రాయనున్నట్లు సమాచారం.