కేసీఆర్ వ్యుహాం భాజపాకి లాభం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యుహాకర్త అనడంలో ఎటువంటి అతియోశక్తిలేదు. ఎందుకంటే ఆయన వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో రాజకీయా లాభాలను తెచ్చిపెడుతుంది. ఇందుకు నిదర్శనం తెలంగాన రాష్ట్రం ఏర్పాటు నుండి తెరాసను అధికారంలోకి తీసుకరావడం వరకు ఇలా చాలా పరిణామాలను మనం చూశాం. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం తిరిగి అధికారంలోకి రావడం పెద్ద పరిణామమే అని చెప్పుకోవాలి.
అయితే గతంలో ఉన్న ఆధారణ ఇప్పుడు తెరాసకు లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు, అమలు చేస్తున్న పథకాలకు పూర్తి వ్యతిరేకత నెలకొంది. రాజకీయంగా చాలా దెబ్బతిన్నది పార్టీ. ఈ సమయంలో ఒంటిరిగా ఎన్నికలకు వెళ్తే…. భారీ ముల్యం చెల్లించుకోకతప్పదు. మరీ ఈ సమయంలో ఎవరితో జోడి కట్టాలనే ఆలోచనలో భాగంగానే సీఎం హస్తం గూటికి దగ్గరవుతున్నారని చెప్పుకోవాలి. భాజపాని ఢీ కొట్టాలంటే ఇతర పార్టీ సహాకారం తప్పని సరి కావాలి.
అందుకే వరుస ప్రెస్ మీట్లు, బహిరంగ సమావేశంలో రాహుల్ గాంధీని పొగుడుతున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వలాని చూస్తున్నట్లు ఉన్నారు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా లేదా అనేది తరువాత విషయం. ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య ఎంటంటే … కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జంప్ చేశారు. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్… కాంగ్రెస్‌తో దోస్తీ వారి పరిస్ధితి ఎంటీ అనే ప్రశ్నార్థకంగా మారింది.
ఈ సమయంలో ఇలాంటి రాజకీయ పరిమాణం జరిగితే మాత్రం భాజపానే తెరాసకు ప్రధాన ప్రత్యర్థిగా మారనుంది. దీన్ని అస్త్రంగా మలుచుకొని ఎన్నికల బరిలోకి భాజపా దూసుకపోతే తప్పకుండా విజయడంఖా మోగించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.