స్వామిజీకి సీఎంకు పెరుగుతున్న దూరం

త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మ‌ధ్య దూరం పెరుగుతోంది. స‌మాత‌మూర్తి విగ్ర‌హా ఆవిష్క‌ర‌ణ‌లో త‌లెత్తిన వివాదాం ఇంకా స‌మిసిపోలేదు. రోజు రోజుకు మ‌రింత క్లిష్ట‌మైన స‌మ‌స్య‌గా మారుతోంది. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి సైతం సీఎం దూరంగా ఉన్నారు. కేసీఆర్‌ను ఈ కార్యక్రమానికి రప్పించేందుకు చినజీయర్‌ స్వామితోపాటు మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఇక త్వ‌ర‌లో యాద‌గిరిగుట్ట‌లో జ‌రిగే ఉత్స‌వాల‌కు చినజీయ‌ర్ వ‌స్తారా , రారా అనేది ఇప్పుడ ప్ర‌శ్న‌ర్థ‌కంగా మారింది. ఆది నుండి దేవాల‌య నిర్మాణంలో సీఎం వెంట చిన‌జీయ‌ర్ ఉన్నారు. ఆయ‌న చెప్పిన ప‌ద్ద‌తిలో ఆల‌య నిర్మాణం జ‌రిగింద‌ని చెప్పుకోవాలి. అయితే స‌మ‌తా మూర్తి విగ్ర‌మా ఆవిష్క‌ర‌ణ‌లో రేగిన వివాదాం యాద‌గిరి గుట్ట ఉత్స‌వాల వ‌ర‌కు కొన‌సాగుతుందా అనేది వేచి చూడాలి మ‌రీ.