పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై మోహ‌న్‌బాబు కీల‌క నిర్ణ‌యం

ప్ర‌ముఖ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇటీవ‌ల ఏపీ మంత్రి పేర్ని నానితో క‌లిసిన త‌రువాత మోహ‌న్‌బాబు రాజ‌కీయ ఎంట్రీపై చ‌ర్చ మొద‌లైంది. దానితో పాటు ఏపీలో సినిమా టికెట్ల వివాదాం కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. చెత్త నా కొడుకులు రాజకీయం చేశారని ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయిన అంశం పై మంచు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పేర్ని నానితో పదేళ్లకు పైగా అనుబంధం ఉందని చెప్పారు. తానే మంత్రి నానితో తమ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని కోరారని చెప్పుకొచ్చారు. కొన్ని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని.. ఈ జన్మకు వద్దని అనుకుంటున్నానన్నారు. తామిద్దరం సరాదాగా అనేక అంశాల పైన చర్చించుకున్నామని వెల్లడించారు.

జగన్ తో జరిగిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలల పైన చర్చ జరగలేదన్నారు. ఒక మంత్రి హోదాలు ఉన్న వ్యక్తిని అలాంటి ప్రశ్నలు ఎలా అడుగాతా అన్నారు. పేర్ని నాని ప్రభుత్వ ప్రతినిధిగా తనతో మాట్లాడలేదని..ఒక స్నేహితుడిగా వచ్చారని తేల్చి చెప్పారు. ఇక, దీనికి కొనసాగింపుగా తన రాజకీయ భవిష్యత్ పైన స్పందించారు. ఇక చంద్రబాబు నాయుడు, జగన్‌ మోహన్‌ రెడ్డి నాకు బంధువులు కాబట్టి గతంలో ప్రచారం చేశాను… చంద్రబాబు నాయుడుకి చేసినట్లు జగన్‌కూ ప్రచారం చేయాలి కాబట్టి చేశామని వెల్లడించారు.ఇప్పుడు నేను సినిమాలు, యూనివర్శిటీ పనులతో బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లకూడదని అనుకుంటున్నాను అని మోహన్‌బాబు అన్నారు.