మూర్ఛ వ్యాధిపై అవగాహాన పెంచుకోవాలి
డాక్టర్. జాషువ కాలేబ్
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కిమ్స్ సవీర, అనంతపురం.
ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14న అంతర్జాతీయ ఎపిలెప్పి (మూర్చవ్యాధి) దినోత్సవాన్ని నిర్వస్తారు. మూర్చవ్యాధితో బాధపడుతున్నవారిలో అవగాహాన పెంచడానికి అన్ని దేశాల్లో అవగాహాన కార్యక్రమాలు చేపడుతారు.
మూర్చవ్యాధి మెదడులో ఉన్న నరాలు కరెంట్ ప్రసరణలో భిన్నమైన మార్పులు కలగడం వలన వస్తుంది. ఈ మార్పుకు కారణం పలు రకాలుగా ఉండవచ్చు. చిన్న వయసులో బిడ్డ ప్రసవించే సమయంలో మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం, శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గడం, మెదడులో ఆకార పరమైన మార్పులు ఉండడం లేదా పెద్దవారైన తరువాత మెదడుకు ఇన్‌పెక్షన్ రావడం కణుతులు ఏర్పడడం, పక్షవాతం వచ్చినప్పుడు మెదడులో మచ్చ ఏర్పడడం మరియు రక్తంలో అమ్మెనియా లాంటి పదార్థాల మోతాదు పెరగడం మరియు కొన్ని జన్యుపరమైన సమస్యలు ఉండడం.
మూర్ఛవ్యాధి లక్షణాలు
చేతులు కాళ్లు కొట్టుకోవడం, కళ్ళు ఆర్పకుండా తెరిచి ఉంచడం, కొన్ని రకలైన ప్రవర్తన మార్పులు, చేతులు, కాళ్లు నిక్క బొడచుకోవడం, కళ్లు ఒకేవైపు ఉంచడం, నోటి గుండా నురుగు రావడం, ఉన్నపాటుగా అపస్మారక స్థితిలోకి వెళ్లడం.
మూర్చవ్యాధి గ్రస్తులు అనేక రకాలైన వివాహా మరియు కుటుంబ సంబంధ సమస్యలతో బాధపడుతు ఉంటారు. మూర్ఛవ్యాధి గ్రస్తులు వివాహాం చేసుకోవడంలో వెనుకాడుతారు. ఈ జబ్బు పుట్టుబోయే పిల్లలకు వస్తుందని, వారు సాధారణ జీవితం జీవించలేరని అపోహాలు ఉన్నాయి. సరియైన వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లైతే వారు సాధారణ జీవితాన్ని జీవించగలరు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మూర్ఛవ్యాధి థీమ్ స్నేహం మరియు చేరిక అనే అంశంతో ముందుకు వెళ్తున్నారు. మూర్ఛవ్యాధి ఉన్నవారని మనలో ఒకరిగా చూడాలి. వారిని రోగులు చూడకూడదు.
మూర్ఛ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మూర్ఛ వచ్చిన సమయంలో ఆ వ్యక్తితోనే ఉండాలి.
పదునైన, హానికరమైన వస్తువులకు దూరంగా ఉంచాలి.
ప్రక్కకు తిప్పి పడుకోపెట్టాలి, నోటిలో ఏ వస్తువులు పెట్టకూడదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నరాల సంబంధిత వైద్యుని సంప్రదించి, సరైన వైద్యం తీసుకోవాలి
మందులు క్రమం తప్పకుండా వాడాలి
నిద్ర మరియు ఆహార నియమాలు పాటించాలి.
మూర్ఛవ్యాధి గ్రస్తులను నరియైన వైద్య విధానాలు పాటించి జాగ్రత్తగా ఉన్నట్లయితే అందరివలే సాధారణ జీవితం జీవించవచ్చు.