మారుతున్న జీవనశైలి – క్యాన్సర్ ముప్పు – కిమ్స్ వైద్యులు
ఇంతకు ముందు వరకు పోగ త్రాగడం, మద్యపానం సేవించడం తంబాకు, గుట్కా నమలడం వంటవి మాత్రమే క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలుగా పరగణించేవారు. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన అనేక పరిశోధనల్లో జీవనశైలిలోని మార్పులు కూడా క్యాన్సర్ రావడనాకి ప్రధాన కారణాలుగా నిరూపించబడింది.
మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మన జీవన శైలిలో చాలా మార్పులు వస్తున్నాయి. అందులో కొన్ని మార్పులు మనకు సహాయం చేస్తున్నా చాలా మార్పుల వల్ల ఆరోగ్య సంబధిత ముప్పు పెరుగుతోంది. ఈ మార్పుల్లో ముఖ్యమైనవి శారీరక బద్దకం, చురుకుగా ఉండకపోవడం, ఆహారం సమయానికి తీసుకోకపోవడం, నిద్రలేమి సమస్యలు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఎక్కువుగా మొక్కల నుండి వచ్చిన ఆహారం, తాజాగా వండిన ఆహారం (నిలువ చేయని) ఎక్కువగా వేపిన ఆహారం తీసుకోవడం.
ఇలాంటి మార్పుల వల్ల మెటబోలిక్ వ్యాధి (అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, రక్తంలో కొవ్వు శాతం పెరగడం) మరియు ఫ్యాటి లివర్ (కాలేయంలో కొవ్వు పెరుకపోవడం) వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ మెటబాలిక్ వ్యాధి, ఫ్యాటి లివర్ వల్ల గుండె జబ్బులు, కాలేయం పాడవడమే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ.
ప్రపంచ జనభా అంతటిని పరిగణలోకి తీసుకొని చేసిన పరిశోధనలో 3,52,911 మందిలో 1,31,282 మంది మెటబాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ఇందులో 23,345 (17.7%) మందికి క్యాన్సర్ వచ్చింది. ఈ పరిశోధన ప్రకారం మూత్రపిండాలు, థైరాయిడ్, అన్నవాహిక, క్లోమము (పాంక్రియాస్) రొమ్ము మరియు ప్రేగు సంబంధిత క్యాన్సర్‌లలో మెటబాలిక్ ఫ్యాటి లివర్ నేది ముఖ్య కారణంగా కనుగొనబడింది.
క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా శారీరక శ్రమ పెంచితే, వైద్యానికి ఎక్కువగా రెస్పాన్స్ వచ్చి క్యాన్సర్ తిరగబడకుండా ఉండే అవకాశాలు ఎక్కువ.
క్యాన్సర్ నివారణ కోసం అమెరికా క్యాన్సర్ సోసైటి నుండి వెలుబడిన ఆహారపు అలవాట్లు మరయు శారీరక శ్రమకు సబంధించిన మార్గదర్శకాలు.
- జీవితాంతం ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండడం మరియు వయోజన శారీరకంగా చురుకుగా ఉండడం. జీవితంలో బరువు పెరగకుండా ఉండడం.
- శారీరక శ్రమ మార్గదర్శకాలు
- పెద్దవారికి – వారంలో 3-5 గంటల మితమైన శారీరక శ్రమ లేదా వారంలో 2-3 గంటల కఠిణమైన శారీరక శ్రమ
- పిల్లలు మరియు యుక్త వయుసు వారికి రోజుకి గంట సేపు మితమైన లేదా కఠినమైన శారీరక శ్రమ చేయడం.
- తగ్గించవలసినవి… ఎక్కువగా కూర్చోవడం, పడుకోవడం, టీవీ లేదా కంప్యూటర్ ముందు ఎక్కువ కూర్చోవడం
- ఆరోగ్యకరమైన అలవాట్లు
- పోషక పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకొని సరియైన బరువు కలిగి ఉండడం.
- ముదురు ఆకుపచ్చని కూరలు, ఎరుపు మరియు నారింజ కలిగిన ఆహారం, చిక్కుళ్లు, బఠాణిలు మొదలైనవి.
- పండ్లు (ముఖ్యంగా పళ్ల రసం చేయకుండా పండ్లను మొత్తంగా తీసుకోవాలి). రకరకాల రంగులు కలిగిన పండ్లు.
- తృణధ్యాన్యాలు ఎక్కువగా తీసుకోవడం (జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు అరిసెలు).
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు - రెడ్ మీట్, ప్రాసేస్ చేయని మాంసం
- తీపి పానీయాలు
- ప్రాసెస్ చేయని ఆహార పదార్థాలు
- రీఫైన్డ్ (శుద్ధి చేసిన ) ధ్యానాలు
- మద్యపానం చేయకపోవడం చాలా మంచింది.
- పబ్లిక్ మరియు ప్రైవేట్ సంస్థలు స్థానిక స్థాయిల్లో సహాకారంతో పని చేయాలి. సరసమైన పోషకమైన ఆహారాన్ని అందించడం మరియు శారీరక శ్రమ కోసం అవకాశాలు అందుబాటులోకి తీసుకోవాలి.
డాక్టర్. నరేంద్రకుమార్ తోట బృందం
కన్సల్టెంట్ మెడికల్ & హెమటో ఆంకాలజిస్ట్
బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్.
డాక్టర్. గౌతమ్ గంధం
డాక్టర్. శివ కుమార్ కొమరవెల్లి