2040 నాటికి భారతదేశంలో గ్లాకోమా (నీటి కాసులు) లోపం రెట్టింపవుతుందని అంచనా

గ్లాకోమా అన్నది కొన్ని రకాల కంటి లోపాల సమాహారం. కంటి లోపల ఒత్తిడి (ఇంట్రాక్యూలార్‌ ప్రెషర్‌ లేదా ఐఓపీ) పెరిగినప్పుడు కంటి నరాలు డ్యామేజ్‌ అవుతాయి. చిత్రాలను మెదడుకు పంపించే కంటి నరాలు దెబ్బతిన్నప్పుడు చూపు పోతుంది. దానికి చికిత్స చేయకుండా అలాగే వదిలిస్తే గ్లాకోమా కారణంగా శాశ్వత అంధత్వం ఏర్పడుతుంది.

జనాభాలో ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో అంధత్వానికి ప్రధాన కారణం గ్లాకోమా. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల గ్లాకోమా రోగులు ఉంటారు. భారతదేశంలో సుమారు 12 మిలియన్ల మంది గ్లాకోమా బాధితులు ఉంటారు. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల తరహాలోనే భారతదేశంలోనూ 50-80% గ్లాకోమా కేసులు గుర్తించకుండానే ఉంటాయి. కాబట్టి, రికార్డుల్లో ఉన్న సంఖ్య అసలు విషయాన్ని వెల్లడించదు. ఏది ఏమైనప్పటికీ, అంతర్జాతీయ పరిమాణాలను బట్టి చూస్తే భారతదేశంలో 2040 నాటికి గ్లాకోమా రోగుల సంఖ్య రెట్టింపు కానుంది.

గ్లాకోమా చిహ్నాలు, లక్షణాలు గ్లాకోమా పరిస్థితి, రకాన్ని బట్టి మారుతూ ఉంటాయని డా.అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్స్‌ హెడ్‌ క్లీనికల్‌ సర్వీసెస్‌ డా.సయ్యద్‌ అస్ఘర్‌ హుస్సేన్ నఖ్వీ అన్నారు. కాంతి చుట్టు వృత్తాలు లేదా ఇంద్ర ధనస్సు రంగుల్లో వృత్తాలు ఏర్పడటం, కాంతిని చూసినప్పుడు అసాధారణమైన మంట వంటివి గ్లాకోమా ప్రారంభ లక్షణాల్లో ఉంటాయి. పక్క చూపు కోల్పోవడం, దూరం చూడలేకపోవడం గ్లాకోమాలో ఉండే మరో లక్షణం. గ్లాకోమా బారిన పడిన వారిలో ఎటువంటి ముందస్తు హెచ్చరికలు ఉండవు. ఈ ప్రభావం ఎంతో నిదానంగా ఉంటుంది కాబట్టి అది తీవ్రమయ్యేంత వరకు ఆ వ్యక్తి తన చూపులో చోటుచేసుకున్న మార్పును గుర్తించలేరు. కాబట్టి, గ్లాకోమాను గుర్తించేందుకు సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవడం మంచిది.

ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలను గ్లాకోమా అవగాహనగా మాసంగా పాటిస్తారు. అందులో భాగంగా డా.అగర్వాల్స్‌ కంటి ఆస్పత్రి భారతదేశవ్యాప్తంగా ఉన్న తన నెట్‌వర్క్‌ ద్వారా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
డా.అగర్వాల్స్‌ కంటి ఆస్పత్రికి చెందిన డా.సయ్యద్‌ అస్ఘర్‌ హుస్సేన్ నఖ్వీ చెప్తున్న దాని ప్రకారం రిస్క్‌ ఫ్యాక్టర్లు ఈ తీవ్ర వ్యాధులను బట్టి పెరుగుతూ ఉంటాయి:

· డయాబెటీస్‌
· కార్డియో వాస్క్యూలర్‌ వ్యాధులు
· అధిక రక్తపోటు
· మయోపియా
· కుటుంబ చరిత్ర

ఒక రకమైన ప్రొటిన్, కొన్ని రకాల కంటి వ్యాధులకు సంబంధించి వాస్క్యూలర్‌ ఎండోథెలియల్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌ (విఈజీఎఫ్‌) వంటి వాటి అధిక ఉత్పత్తి కోసం తీసుకునే కొన్ని రకాల చికిత్సలు (వీటిని వీఈజీఎఫ్‌ చికిత్స అని కూడా అంటారు), అలాగే నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలను ఎక్కువ కాలం ఉపయోగించేవారు గ్లాకోమా బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. తీవ్రమైన పరిస్థితులు లేదా కుటుంబ చరిత్ర లేనివారు సహ గ్లాకోమా అన్నది అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది. పిల్లల్లోనూ దీన్ని గుర్తించారు.
ప్రధానంగా రెండు రకాల గ్లాకోమా ఉంటుంది: ఒపెన్‌-యాంగిల్‌ గ్లాకోమా, యాంగిల్‌-క్లోజర్‌ గ్లాకోమా. కార్నియా, ఐరిస్‌ మధ్యన ఉండే కోణాన్ని నేత్రవైద్యులు పరీక్షించి అది ఒపెన్‌ యాంగిల్‌ లేదా యాంగిల్‌ క్లోజర్‌ గ్లాకోమా అన్నది నిర్థారిస్తారు. ఈ రెండు రకాల పరిస్థితుల్లోనూ ఐరిస్‌, కార్నియా కలిసే కోణం నుంచి కంటి ద్రవం ప్రవాహించకుండా నిరోధానికి గురవుతాయి. సాధారణ స్థాయిలో ద్రవం ప్రవాహించదు కాబట్టి, కంటి లోపల ఒత్తిడి పెరిగి అది కంటి నరాలను దెబ్బతీస్తుంది.

గ్లాకోమా నయం కాదు కాని దాన్ని నియంత్రించవచ్చు. ఐ డ్రాప్స్‌, మాత్రలు, లేజర్‌ ప్రక్రియలు, ఆపరేషన్ల ద్వారా గ్లాకోమా పరిస్థితిని మ్యానేజ్‌ చేయవచ్చు. ఇన్సూలిన్‌ కంట్రోల్‌లో ఉంటే గ్లాకోమాను నియంత్రించవచ్చు. ఇన్సూలిన్‌ లెవల్ పెరిగితే అది కంటి లోపల ఒత్తిడి పెంచుతుంది.

కంటి లోపల నుంచి ద్రవాన్ని బయటకు పంపించేందుకు కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రాబెక్యూలెక్టమీ అనే ఒక రకమైన గ్లాకోమా శస్త్రచికిత్సను కంటిలో నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దశాబ్దాలుగా ఈ సర్జికల్‌ ప్రొసీజర్‌ను వైద్యులు అనుసరిస్తున్నారు. గ్లాకోమా పెరుగుదలను గుర్తించేందుకు, కంటి చూపు కోల్పోకుండా నివారించేందుకు గ్లాకోమా రోగులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే మందులు, చుక్కల మందులు సక్రమంగా ఉపయోగించాలి. క్రమం తప్పకుండా చికిత్స తీసుకున్నా గ్లాకోమా బారిన పడిన వారిలో దాదాపు15% మందికి ఇరవై ఏళ్లలోపు కనీసం ఒక కంటి చూపు పూర్తిగా పోతుంది.

భారతదేశంలో లక్షలాది మందికి అర్హులైన నేత్ర నిపుణులు, కంటి ఆస్పత్రులు అందుబాటులో లేవు అంటున్నారు డా.సయ్యద్‌ అస్ఘర్‌ హుస్సేన్ నఖ్వీ. మౌలిక సదుపాయాల లేమి, దేశంలో నేత్ర సంరక్షణ సదుపాయాలు అసమానంగా ఉండటం ఆందోళన కలిగించే పరిమాణం. అధిక రిస్క్‌ జనాభా ఉండే మారుమూల ప్రాంతాల్లోనూ ఆధునిక కేంద్రాలు ఏర్పాటు చేసి మెరుగైన సదుపాయాలు అందించడం దేశానికి అవసరం.

పెరుగుతున్న గ్లాకోమా సవాళ్లను ఎదుర్కొనేందుకు రిస్క్‌ ఫ్యాక్టర్లు, గ్లాకోమా లక్షణాల గురించి అవగాహన పెంచడం ముఖ్యం. 60 ఏళ్లు, ఆ పై వయస్సు ఉన్న వారు ఎటువంటి లక్షణాలు ఉన్నా లేదా లేకపోయినా కనీసం ప్రతీ 1-2 సంవత్సరాలకు గ్లాకోమా పరీక్షలు చేయించుకోవాలి. అలాగే 40-60 వయోశ్రేణిలో ఉన్నవారు ప్రతీ 2-3 సంవత్సరాలకోసారి పరీక్షలు చేయించుకోవాలి. గ్లాకోమాను ప్రారంభ దశల్లోనే గుర్తించేందుకు 40 ఏళ్ల లోపు వారు కనీసం ప్రతీ 2-4 సంవత్సరాలకోసారి కంటి డాక్టరును సంప్రదించాలి.