వాద్వానీ టేకాఫ్‌ను ఆవిష్కరించిన వాద్వానీ ఫౌండేషన్‌

వాద్వానీ ఫౌండేషన్‌ మరియు నేషనల్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌ఈఎన్‌) నేడు వాద్వానీ టేకాఫ్‌ కార్యక్రమం ప్రారంభించినట్లు వెల్లడించాయి. ఎంపిక కాబడిన స్టార్టప్స్‌ మరియు వ్యాపారవేత్తలు పూర్తి ఖర్చులు భరించినటువంటి సిలికాన్‌ వ్యాలీ యాత్రను పొందగలరు. సాంకేతిక ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతకు సంబంధించి అంతర్జాతీయ కేంద్రం సిలికాన్‌ వ్యాలీ. వాద్వానీ టేకాఫ్‌ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు వ్యాలీ యొక్క వ్యవస్ధాపక పర్యావరణ వ్యవస్థను అన్వేషించే అవకాశం లభించడంతో పాటుగా వ్యాపారవేత్తలతో నెట్‌వర్కింగ్‌ ఎక్స్‌పోజర్‌, వ్యాపార నాయకులు, వ్యవస్ధాపకులతో మెంటార్‌షిప్‌ మరియు మదుపరుల ముందు తమ ఆలోచనలను వెల్లడించే అపూర్వ అవకాశం కలుగుతుంది.

వాద్వానీ టేకాఫ్‌ ఆవిష్కరణ గురించి వాద్వానీ ఫౌండేషన్‌ ఇండియా/ఎస్‌ఈఏ ాఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ సంజయ్‌ షా మాట్లాడుతూ ‘‘భారతీయ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ 2021లో గణనీయంగా వృద్ధి చెందింది. దాదాపు 78 యునికార్న్‌లు, 8 ఐపీఓలతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా నిలిచింది. 2025 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా నిలువాలనే లక్ష్యంలో భారతదేశానికి ప్రపంచశ్రేణి స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ తప్పనిసరి. వాద్వానీ టేకాఫ్‌ కార్యక్రమం ఎంతోమందిని వ్యవస్థాపకతకు ఆకర్షించడంతో పాటుగా సిలికాన్‌ వ్యాలీలో అత్యుత్తమ వ్యాపారవేత్తలు, మెంటార్లు, మదుపరులను కలుసుకునే అవకాశమూ కలుగుతుంది’’ అని అన్నారు.

వాద్వానీ ఎన్‌ఈఎన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, రాజీవ్‌ వారియర్‌ మాట్లాడుతూ ‘‘దాదాపు రెండు దశాబ్దాలుగా వ్యవస్ధాపకతను ప్రోత్సహించడంలో వాద్వానీ ఫౌండేషన్‌ మరియు ఎన్‌ఈఎన్‌లు అగ్రగామిగా వెలుగొంతుతుండటంతో పాటుగా ఉద్యోగార్థులను ఉద్యోగ కల్పనదారులుగా తీర్చిదిద్దే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. వాద్వానీ టేకాఫ్‌ కార్యక్రమం ఇప్పుడు మరింతగా ఎన్‌ఈఎన్‌ యొక్క ప్రయత్నాలకు తోడ్పాటునందించడంతో పాటుగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సిలికాన్‌ వ్యాలీ పర్యావరణ వ్యవస్థను అన్వేషించే అవకాశమూ అందిస్తుంది’’ అని అన్నారు

వాద్వానీ టేకాఫ్‌ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://entrepreneur.wfglobal.org/wadhwani-takeoff/ చూడవచ్చు.