మల ద్వారం నుండి బయటకి వచ్చిన పెద్ద ప్రేగు
మల ద్వారం నుండి బయటకు వచ్చిన పెద్ద ప్రేగుకి అరుదైన శస్త్రచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు కిమ్స్ సవీర వైద్యులు. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసి చరిత్ర సృష్టించారు. మల ద్వారం నుండి పెద్ద ప్రేగు జారీ పోవడానికి గల కారణాలు, చికిత్స పద్దతులను జనరల్ సర్జన్ డాక్టర్. అబిబ్ రాజా, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ & జిఐ ఆంకాలజీ డాక్టర్. జానకిరామ్ మీడియాకు వెల్లడించారు.
” బీహార్ రాష్ట్రానికి చెందిన కాశీనాథ్ (66) పనుల నిమిత్తం అనంతపురం పట్టణానికి వచ్చారు. గత కొన్నాళ్లుగా అనంతపురంలోనే ఉంటున్న అతనికి మలవిసర్జన సమయంలో రక్తం పడుటను గమణించారు. ఈ విషయాన్ని సాధారణమే అనుకొని నిర్లక్ష్యం చేసి వదిలేశాడు. అయితే ఇటీవల మల విజర్జనకు వెళ్లిన అతనికి మలవిసర్జన సమయంలో మలంతో పాటు పెద్దప్రేగు కూడా బయటకు వచ్చేసింది. దీంతో రెండు రోజులపాటు తీవ్రమైన బాధతో సమీపంలో ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరిగారు. ఎక్కడ కూడా నయం కాకపోవడంతో కిమ్స్ సవీరకు వచ్చారు.
ఇక్కడికి వచ్చాక వివిధ రకాల పరీక్షలు చేసి వ్యాధి తీవ్రతను తెలుసుకున్నాం. ఆలస్యం చేయకుండా అతనికి వెంటనే అల్టెమెయిర్ విధానం (పెరినియల్ ప్రోక్టోసిగ్మోయిడెక్టమీ) సర్జరీ చేసి అతని ప్రాణాపాయస్థితి నుండి రక్షించాం. ఇది మల ప్రొసిడెన్షియా యొక్క అరుదైన కేసుగా గుర్తించాం. ఈ విధానంలో మల ద్వారం నుండి బయటకు వచ్చిన పెద్దప్రేగును కట్ చేసి శరీరంలో ఉన్న ప్రేగుకు కలిపి తిరిగి శరీరంలోకి పంపించాం. దీంతో రోగికి ఉపశమనం కలిగింది. ఇలాంటి శస్త్రచికిత్స చేయడం ఈ ప్రాంతంలోనే ఇదే మొదటిసారి.
ఈ ప్రేగు జారీ పోయిన తర్వాత దానికి రక్త ప్రసరణ ఆగిపోతోంది. దీంతో రోగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది. ఇలా ప్రేగులు జారీ పోవడానికి కారణాలు ఉంటాయి. ఒకటి కడుపులో ప్రేగు వదులు కావడం, రెండోది వయసు ప్రభావం, మూడవది మజిల్స్ బలహీనం పడడం, నాల్గవది మలబద్దకం ఈ కారణాలతో ఇలాంటి ప్రమదాలు చోటు చేసుకుంటాయి. అయితే ఈ రోగి గత కొన్నేళ్లుగా మలబద్దకం సమస్య ఉంది. దీని వల్ల కూడా ఈ ప్రమాదం జరగవచ్చు. మలబద్దకం సమయంలో విపరీతమైన నొప్పి, రక్తస్రావం కావడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమయంలో మల విసర్జనకు వెళ్లినప్పుడు ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకోలేక పెద్ద ప్రేగు మల ద్వారం ద్వారా జారీ పోతాయి.
ఈ రోగిలో కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. మల ద్వారం ద్వారా దాదాపు 50 సెంటీ మీటర్ల పెద్ద ప్రేగు బయకు వచ్చింది. జారీ పోయిన ప్రేగు పూర్తిగా కుళ్లిపోయింది. కుళ్లిపోయిన ప్రేగును శస్త్రచికిత్స ద్వారా తొలగించి మిగిలిన ప్రేగుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మలం ద్వారం దగ్గర ఉన్న స్పింక్టర్ కండరము దెబ్బతినకుండా శస్త్రచికిత్సను విజయవంతం చేశాం.
కిమ్స్ సవీరలో అందుబాటులో ఉన్న అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశాం. “
అనంతరం రోగి మాట్లాడుతూ ప్రాణాలు పోతాయాని భయపడ్డాను కానీ డాక్టర్. అబిబ్ రాజా, డాక్టర్ జానకీరామ్‌ల బృందం సర్జరీ చేసి నా ప్రాణాలు కాపాడారు. డాక్టర్లకి, కిమ్స్ సవీర యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.