డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వామ్యం ప్రకటించిన ఆస్ట్రేలియా యొక్క బ్లాక్‌ మోర్స్‌

ఆస్ట్రేలియా కేంద్రంగా కలిగిన మరియు అంతర్జాతీయంగా అభిమానించే సహజసిద్ధమైన ఆరోగ్య మరియు డైటరీ సప్లిమెంట్స్‌ కంపెనీ, బ్లాక్‌మోర్స్‌ నేడు తమ శ్రేణి మల్టీ విటమిన్‌ ఉత్పత్తులను భారతదేశంలో అందించడం కోసం ఉడాన్‌తో పంపిణీ భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, బ్లాక్‌మోర్స్‌ శ్రేణి ప్రీమియం మల్టీ విటమిన్‌ ఉత్పత్తులు భారతదేశంలో స్వతంత్య్ర ఫార్మసీలకు అందుబాటులో ఉండనున్నాయి.

తమ వృద్ధి కోసం బ్లాక్‌మోర్స్‌ లక్ష్యంగా చేసుకున్న మార్కెట్‌ ఇండియా. ఇప్పటికే ఇది ఆసియా–పసిఫిక్‌ వ్యాప్తంగా 12 ఇతర మార్కెట్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. భారతదేశంలో తమ ప్రవేశారంభానికి గుర్తుగా ఆరోగ్యవంతమైన ఎముకలు, రోగ నిరోధక శక్తి కోసం బ్లాక్‌మోర్స్‌ షైన్‌ పవర్‌ డీ3; కీళ్ల ఆరోగ్యం కోసం బ్లాక్‌మోర్స్‌ గ్లూకోజ్‌ గ్రీన్‌ 1500 ; కంటి ఆరోగ్యం కోసం బ్లాక్‌మోర్స్‌ బ్లూ లైట్‌ డిఫెన్స్‌,ఎముకల ఆరోగ్యం కోసం బ్లాక్‌ మోర్స్‌ బయో కాల్షియం , గుండె ఆరోగ్యం కోసం బ్లాక్‌మోర్స్‌ సీఓక్యు10 150ఎంజీ విడుదల చేసింది.

బ్లాక్‌మోర్స్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అలస్టెయిర్‌ సిమింగ్టన్‌ మాట్లాడుతూ ‘‘ప్రకృతి సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తితో ప్రజలను అనుసంధానించడం పట్ల బ్లాక్‌మోర్స్‌ అభిరుచి కలిగి ఉంది. మా ఉత్పత్తులు అత్యున్నత నాణ్యత కలిగి ఉన్నవనే భరోసా కలిగి ఉండేందుకు అత్యధిక పోషకాలు కలిగిన పదార్థాలను ఎంపిక చేసుకున్నాము. ఉడాన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆవిష్కరించడం ద్వారా భారతదేశంలో ఇంటి పక్క ఫార్మసీలను చేరుకునే అవకాశం లభించింది. సహజసిద్ధమైన ఆరోగ్యం పట్ల అభిరుచి కలిగి భారతీయుల ప్రయాణంలో భాగం కానుండటం పట్ల సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

ఉడాన్‌, ఫుడ్‌ అండ్‌ ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా విభాగపు అధినేత వివేక్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘బ్లాక్‌మోర్స్‌ శ్రేణి ఉత్పత్తులు మా వేదికపై లభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. దేశవ్యాప్తంగా ఫార్మసీలతో మా శక్తివంతమైన సంబంధాలు, సామర్థ్యం కారణంగా తయారీదారుల పంపిణీ అవసరాలను తీర్చగలం’’అని అన్నారు

‘‘నేచురల్‌ హీలింగ్‌లో 90 సంవత్సరాల వారసత్వం బ్లాక్‌మోర్స్‌కు ఉంది. సహజసిద్ధమైన, సమగ్రమైన ఆరోగ్యం పట్ల అభిరుచి కలిగిన భారతీయులు ఇప్పుడు బ్లాక్‌ మోర్స్‌ను తమ జీవిత ప్రయాణంలో భాగంగా చేసుకోవడం ద్వారా సంతోషకరమైన జీవితాలను గడుపగలరు’’ అని శామ్‌ ఫ్రీమన్‌, ట్రేడ్‌ కమిషనర్‌, ఆస్ట్రేలియన్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిషన్‌– ఆస్ట్రేలియన్‌ హై కమిషన్‌ అన్నారు