అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్‌లో వడ్డీ లేని ఈఎంఐ
నగరంలోని ప్రధాన ఆసుపత్రులతో ఒకటైన అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి (ఎల్బీ నగర్) రోగుల సదుపాయం కోసం ఆసుపత్రిలో చేరికలకు, ఇతర వైద్యపరమైన అవసరాల నిమిత్తం “చికిత్సలకు వడ్డీ లేని ఈఎంఐ” సదుపాయాన్ని ప్రారంభించింది. బజాజ్ ఫిన్‌సెర్వ్ సంస్థతో కలిసి ఈ ఈఎంఐ సదుపాయాన్ని ఆసుపత్రి కల్పిస్తోంది. ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితుల కోసం రూ.4 లక్షల వరకు అయ్యే మొత్తానికి ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు.
ఈఎంఐ సదుపాయంతో రోగులు, వారి కుటుంబసభ్యులు ఆర్థిక పరిమితులను అధిగమించి అన్నిరకాల అత్యవసర పరిస్థితులు.. అంటే గుండె సమస్యలు, ప్రమాదాల్లాంటి సందర్భాల్లో చికిత్సలు పొందవచ్చు. ఎలక్టివ్ సర్జరీలు, ఇతర చికిత్సలకూ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. అన్నిరకాల సమస్యలకు అత్యుత్తమ చికిత్సలను అందుబాటు ధరల్లో, ప్రత్యామ్నాయ మార్గాలతో అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి అందిస్తుంది.
ఈఎంఐ సదుపాయం, దాని ప్రయోజనాల గురించి అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి సీఓఓ డాక్టర్ సత్వీందర్ సింగ్ సభర్వాల్ మాట్లాడుతూ, “ఏ కుటుంబానికైనా, ఏ సమయంలోనైనా ఆరోగ్యపరమైన అత్యవర పరిస్థితి రావచ్చు. ఇలాంటి వాటికి ఆర్థికపరంగా సిద్ధంగా ఉండటం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు అందరికీ ఆరోగ్యబీమా తీసుకోవడం వల్ల వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు. అయితే, ఎవరికైనా తగినంత బీమా లేకపోతే బజాజ్ ఫిన్‌సెర్వ్ అందిస్తున్న ఈ హెల్త్ ఈఎంఐ సదుపాయం సాయపడుతుంది. రోగులు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ చికిత్సలను మా ఆసుపత్రి అందిస్తుంది, ఆపత్కాలంలో వారి ఆర్థిక అవసరాలను బజాజ్ ఫిన్‌సెర్వ్ తీరుస్తుంది” అని చెప్పారు.
మొత్తం బిల్లులో రోగుల కుటుంబసభ్యులు కేవలం మూడోవంతు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తానికి (రూ.4లక్షలు మించకుండా) బజాజ్ ఫిన్‌సెర్వ్ వడ్డీలేని ఈఎంఐ రూపంలో సాయం చేస్తుంది. అన్నిరకాల అత్యవసరాలు, చికిత్సలు ఇందులో కవర్ అవుతాయి. దంతవైద్యం, కంటి వైద్యం, రోగ నిర్ధారణలు, మూలకణ చికిత్సలు, గర్భవతుల చికిత్స, బరువు తగ్గే చికిత్సలు, కాస్మెటిక్ మరియు ప్లాస్టిక్ సర్జరీలు, జుట్టు మొలిపించే చికిత్సలు, ఇంకా అనేక రకాల వాటికి ఈఎంఐ సదుపాయం వర్తిస్తుంది.