సురక్షితంగా కూ యాప్‌

సోషల్ మీడియాలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన చర్చను సురక్షితంగా ఉంచే దిశగా, దేశంలోని మొట్టమొదటి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ యాప్ ‘వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను పాటిస్తుంది. మొదటిసారిగా, ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) రూపొందించిన స్వచ్ఛంద ప్రవర్తనా నియమావళిని 2019 సాధారణ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. ఈ ప్రవర్తనా నియమావళి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను నిష్పక్షపాతంగా మరియు నైతికంగా ఉపయోగించడం కోసం. ఫిబ్రవరి మరియు మార్చి 2022 మధ్య ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా మరియు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళిని అనుసరించడం ద్వారా, కూ యాప్ అనేది వినియోగదారులకు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ సురక్షితమైన మరియు న్యాయమైన ఎన్నికలకు కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తుంది. అదే సమయంలో కూ(Koo App) బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వేదికగా వ్యవహరిస్తుంది

భారతీయులు తమ మాతృభాషలో తమ భావాలను వ్యక్తీకరించే హక్కును కల్పించే మేడ్-ఇన్-ఇండియా ప్లాట్‌ఫారమ్ ,ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను పరిమితం చేయడానికి భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తుంది. కూ యాప్ వినియోగదారులకు ఎన్నికల చట్టాల గురించి అవగాహన కల్పిస్తుంది మరియు వారిపై నమ్మకాన్ని పెంచుతుంది

ఒక ప్రముఖమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా, Koo యాప్ ప్రత్యేకంగా రూపొందించిన ఫిర్యాదుల పరిష్కార సెల్‌ని కలిగి ఉంది, ఇది సకాలంలో పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది, దుర్వినియోగ మరియు హానికరమైన కంటెంట్ నుండి వినియోగదారులను రక్షిస్తుంది మరియు బాధ్యతాయుతమైన ఆన్‌లైన్ ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది. 10 భాషలలో ఆలోచనలను సమర్పించడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది ఈ బహుళ భాషా ప్లాట్‌ఫారం, కంప్లయన్స్ పాలసీని రూపొందించిన మొదటి భారతీయ సోషల్ మీడియా మరియు ప్రస్తుతం ఉన్న నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా కంప్లయన్స్ నివేదికలను క్రమం తప్పకుండా అందజేయడమే కాకుండా నియమాలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను ముందస్తుగా మోడరేట్ చేస్తుంది.

కూ యాప్ సహ వ్యవస్థాపకుడు మరియు CEO అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “నేడు ప్రజల జీవితాల్లో సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ప్రక్రియ గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో, అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో వారిని ప్రభావితం చేయడంలో ఉపకరిస్తుంది. నిష్పాక్షికమైన, పారదర్శకమైన మరియు విశ్వసనీయమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారంగా, IAMAI రూపొందించిన స్వచ్ఛంద నియమావళి యొక్క స్ఫూర్తికి మరియు అందులో ఉన్న ప్రతి అక్షరానికి కూ కట్టుబడి ఉంటుంది; స్వేచ్ఛాయుతమైన మరియు నిష్పక్షపాతమైన ఎన్నికలను జరిపేందుకు కృషి చేస్తుంది, ఇది ఏ ప్రజాస్వామ్యానికైనా ముఖ్య లక్షణం. మా బెస్ట్-ఇన్-క్లాస్ కంప్లయన్స్ మరియు ఫిర్యాదుల పరిష్కార విధానాలు యూజర్లకు వారి ఆలోచనలను వ్యక్తీకరించడానికి మరియు వారి కమ్యూనిటీలతో తమకి నచ్చిన భాషలో కనెక్ట్ అవ్వడానికి సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని అందిస్తాయి. మా యూజర్లకు సురక్షితమైన మరియు అత్యుత్తమ భాషా అనుభవాన్ని అందించడానికి ఉత్తమ విధానాలు మరియు మంచి ఫలితాలు ఇచ్చే పరిష్కారాలను గుర్తించడానికి కూ యాప్ ప్రయత్నిస్తుంది.” అని అన్నారు.