తెలంగాణ‌లో థార్డ్ వేవ్ మొద‌లైంది

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ థార్డ్ వేవ్ మొద‌లైంద‌ని షాకింగ న్యూస్ చెప్పాడు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు ప్రకటించారు. తెలంగాణలో గడిచిన మూడు.. నాలుగు రోజులుగా పెరుగుతున్న కేసుల్ని చూస్తే.. థర్డ్ వేవ్ కు సంకేతాలుగా చెప్పొచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని చెప్పారు.

రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆయన.. వచ్చే 2 నుంచి 4 వారాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తాజా పరిణామాల్ని చూస్తే.. థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లేనని చెప్పొచ్చన్నారు. వచ్చే సంక్రాంతికి థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని చెప్పిన ఆయన.. వ్యాక్సిన్ వేసుకుంటే కొత్త వేరియంట్ ముప్పు నుంచి తప్పించుకునే వీలుందన్నారు. డెల్టా వేరియంట్ కంటే 30 రెట్లు వేగంగా విస్తరిస్తోందన్న మాట వినిపిస్తోందన్న ఆయన.. ఒమిక్రాన్ ఇప్పటివరకు 130 దేశాలకు పాకిందన్నారు.

ఒక్కరోజే అమెరికాలో 4 లక్షలు.. యూకేతో పాటు పలు దేశాల్లో లక్షకు పైగా కేసులు నమోదైనట్లు చెప్పారు. కొత్త సంవత్సరం వేడుకల్ని ఎంజాయ్ చేయాలని.. పార్టీలు చేసుకోవాలి కానీ.. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం సైతం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు.

రాబోయే రోజుల్లో టెస్టుల సంఖ్య పెంచబోతున్నట్లు చెప్పిన ఆయన..గడిచిన రెండు రోజులుగా కొవిడ్ పాజిటివ్ రేటు పెరుగుతుందన్నారు. గతంలో మాదిరే కొవిడ్ పాజిటివ్ రేటు పెరుగుతోందన్నారు. చికిత్స కూడా గతంలో మాదిరేనని.. అందులో ఎలాంటి మార్పులు లేవన్నారు. థర్డ్ వేవ్ తో కొవిడ్ కు అంతమన్న ఆయన మాటల్ని చూసినప్పుడు. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్న విషయం అర్థం కాక మానదు.