పెళ్లిళ్ల సీజన్ సందర్భంలో బహుమతులివ్వడాన్ని మరింత సులభం చేసిన పేటీఎం
మీరు అభిమానించే వాళ్లకు డిజిటల్ గోల్డ్ ను బహుమతిగా ఇవ్వండి
పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా మీరు గనుక పర్ఫెక్ట్ బహుమతి ఇవ్వాలనుకుంటే డిజిటల్ బంగారాన్ని బహుమతిగా ఇవ్వడానికి మించింది మరేదీ లేదు. అది ఓ జంట ఇన్వెస్ట్ మెంట్ ప్రయాణానికి ప్రారంభం కూడా అవుతుంది. ఇలా ఇవ్వడాన్ని శుభారంభంగా కూడా భావిస్తారు.
డిజిటల్ గోల్డ్ గనుక ఉంటే, భౌతిక బంగారం తరహాలో భద్రపరిచే విషయంలో ముప్పు ఎదుర్కోవాల్సిన అవ సరం లేదు. నిజానికి ఇన్వెస్ట్ చేయడంలో ఇదొక తెలివైన విధానం. భారతదేశ అగ్రగామి డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అయిన పేటీఎం డిజిటల్ గోల్డ్ ను ఈ వేదికపై అందిచండం ప్రారంభించిన మొదటి కంపెనీ.
కనిష్ట లేదా గరిష్ట బడ్జెట్ అనేది లేకుండా డిజిటల్ గోల్డ్ ను పేటీఎం ద్వారా పెళ్లి కుమార్తెకు లేదా పెళ్లి కుమారు డికి బహుమతిగా అందించవచ్చు. వధూవరులు కావాలానుకుంటే ఆ గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ను అలా పెంచు కుంటూ పోవచ్చు లేదా విక్రయించుకోవచ్చు లేదా దాన్ని తమ అవసరాలకు అనుగుణంగా భౌతిక నాణేలుగా కూడా మార్చుకోవచ్చు.
పేటీఎం గోల్డ్ అనేది బిఐఎస్ – సర్టిఫైడ్ డిజిటల్ గోల్డ్ ను ఒక నిమిషం కన్నా తక్కువ వ్యవధిలో, తమకు గల బడ్జెట్ లో యూజర్లు 24 క్యారెట్ల 999.9 స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని కొనేందుకు వీలు కల్పిస్తుంది. వారు రూ.1 ప్రారంభవెలతో వారం వారం లేదా నెలా నెలా ఆటో పేమెంట్స్ కూడా తమ సొంత గోల్డ్ సేవింగ్ ప్లాన్స్ ను ఎంచుకోవచ్చు. డిజిటల్ బంగారాన్ని నాణేలుగా లేదా కడ్డీలుగా మార్చుకొని తమ నమోదిత చిరునామా వద్ద పొందే అవకాశాన్ని కూడా ఈ వేదిక అందిస్తోంది.
యూజర్లు పేటీఎంలో 3 సరళదశల్లో 24 – క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు:
మొదటి దశ: పేటీఎంకు లాగాన్ కావాలి మరియు పేటీఎం గోల్డ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి
రెండో దశ: రోజువారీ బంగారం ధరను తనిఖీ చేసుకోండి, కోరుకున్న మొత్తం (రూ.లలో) లేదా పరిమాణం (గ్రాములలో) ఎంటర్ చేయండి.
మూడో దశ: కొనుగోలుచేసిన బంగారాన్ని తక్షణం తమ డిజిటల్ లాకర్ లోకి పొందేందుకు వీలుగా పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డుల ద్వారా ద్వారా చెల్లింపు ను పూర్తి చేయవచ్చు