ZOO PARK హైదారాబాద్ జూపార్క్‌లో విదేశీ ప‌క్షులు

ZOO PARK

హైదారాబాద్‌లోని నెహ్రు జూపార్కులోకి విదేశీ ప‌క్ష‌లను తీసుకవ‌చ్చ‌మ‌ని అట‌వీశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. రూ1.33 కోట్ల‌తో నూత‌నంగా ప‌క్షుల ఎవియ‌రీని ఏర్పాటు చేశామ‌న్నారు. గురువారం జూ పార్క్‌లో పక్షుల ఎవియారీంతో పాటు వైల్డ్ డాగ్స్ ను ఎన్ క్లోజర్ లోకి విడుదల, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…
చిన్నపిల్లల తో పాటు పెద్దలకు ఆహ్లాదం తో పాటు విజ్ఞానాన్ని నెహ్రూ జూ పార్క్ అందిస్తోంది. నిత్యం వేలాది మంది సందర్శకులు జూ ను సందర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు జూ లో కొత్త సౌకర్యాలను మెరుగు పరుస్తున్నాం. ప‌క్షి ప్రేమికుల‌ను ఆక‌ట్టుకునేలా జూ పార్క్ లో స‌హ‌జసిద్ధంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్లలో ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ద‌క్షిణ అమెరికా ఖండాల్లో క‌నిపించే అరుదైన ప‌క్షి జాతికి చెందిన 680 ర‌కాల ప‌క్షుల‌ను ఇందులో ఉంచామ‌ని తెలిపారు.