కిడ్నీ నుండి 156 రాళ్లు తొలగించిన వైద్యులు
నగరంలోని కిడ్నీ ఆసుపత్రులలో ప్రధానమైన వాటిలో ఒకటైన ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. హుబ్లీకి చెందిన 50 ఏళ్ల వయసున్న వ్యక్తి కిడ్నీలలో ఉన్న 156 రాళ్లను కీహోల్ సర్జరీతో తొలగించారు. పెద్ద ఆపరేషన్ చేయకుండా కేవలం లాపరోస్కొపీ, ఎండోస్కొపీలతోనే ఇంత ఎక్కువ సంఖ్యలో రాళ్లు తొలగించడం దేశంలో ఇదే మొదటిసారి.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన బసవరాజ్ మడివలార్‌కు కడుపులో నొప్పి మొదలైంది. అతడిని పరీక్షించగా కిడ్నీలలో పెద్దమొత్తంలో రాళ్లు ఉన్నట్లు కనిపించింది. అయితే, అతడికి సాధారణంగా మూత్రకోశం సమీపంలో ఉండాల్సిన కిడ్నీ దానికి బదులు కడుపు దగ్గరలో ఉంది. దీన్ని ఎక్టోపిక్ కిడ్నీ అంటారు. ఇలా ఉండటం సమస్యకు కారణం కాకపోయినా, ఇలాంటిచోట ఉన్న కిడ్నీలోని రాళ్లను తీయడం మాత్రం చాలా పెద్ద ప్రయత్నమే.
రోగి పరిస్థితి గురించి, చేసిన చికిత్స గురించి ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి యూరాలజిస్టు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి. చంద్రమోహన్ మాట్లాడుతూ, “ఈ రోగికి దాదాపు రెండేళ్లకు ముందు నుంచే ఈ రాళ్లు ఏర్పడటం మొదలై ఉంటుంది. కానీ గతంలో ఆయనకు ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. అయితే ఉన్నట్టుండి బాగా నొప్పి రావడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. దాంతో కిడ్నీలో పెద్ద మొత్తంలో రాళ్లు కనిపించాయి. అతడి ఆరోగ్య పరిస్థితిని గమనించిన తర్వాత రాళ్లు తీయడానికి పెద్ద ఆపరేషన్ చేయడానికి బదులు లాపరోస్కొపీ, ఎండోస్కొపీలనే ఉపయోగించాలని నిర్ణయించాం.”
“కచ్చితమైన ప్రణాళికతో సిద్ధమైన మేము.. దాదాపు మూడు గంటల పాటు కష్టపడి మొత్తం 156 రాళ్లను తీశాం. శరీరంపై పెద్ద కోతకు బదులు కేవలం కీహోల్ మాత్రమే చేసి అన్నింటినీ తీసేశాము. ఆయన ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉండి, తన రోజువారీ పనులు చేసుకుంటున్నారు” అని డాక్టర్ చంద్రమోహన్ వివరించారు.
గత కొన్నేళ్లుగా ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి ఇలాంటి ఎన్నో సంక్లిష్టమైన చికిత్సలను అన్ని వయసుల రోగులకూ చేసింది. అత్యంత తక్కువ వయసు ఉన్నవారికి కిడ్నీలో రాళ్లు తీయడం నుంచి వృద్ధులకు సంక్లిష్టమైన చికిత్సలు చేయడం వరకు ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రిలోని వైద్యులు అనేక రికార్డులు సాధించారు. చాలా సందర్భాల్లో వైద్యచరిత్రలో సాధించిన విజయాలతో తమ రికార్డులు తామే తిరగరాశారు.
ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి గురించి:
హైదరాబాద్ నగరంలో అగ్రశ్రేణి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రులలో ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి ఒకటి. ఇందులో అంతర్జాతీయ స్థాయి వైద్యులతో పాటు, అదే స్థాయి టెక్నాలజీ ఉంది. ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి రోగుల సంరక్షణ, పరిశోధన, సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం ద్వారా రోగుల అవసరాలు తీరుస్తోంది. ప్రీతి ఆస్పత్రి కేవలం కిడ్నీ సమస్యల్లోనే కాక.. ఆండ్రాలజీ లాంటి విభాగాల్లోనూ తన ప్రత్యేకతను నిరూపించుకుంది. కిడ్నీలలో రాళ్లు తీసేందుకు యూఆర్ఎస్/పీసీఎన్ఎల్/లేజర్ ఆర్ఐఆర్ఎస్ లాంటి అత్యాధునిక పరికరాలు ఉపయోగిస్తారు. వీరు లాపరోస్కొపిక్ సర్జరీలో నిపుణులు. దానివల్ల కిడ్నీరాళ్లను మరింత సమర్థంగా, సులభంగా తీయగలరు.