నేడు భాజపాలోకి తీన్మార్ మల్లన్న
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గట్టి పునాదులు వేస్తోంది. ఇప్పటికే తెరాస నుంచి అనేక మంది భాజపాలో చేరారు. గతంలో తెరాసలో ఇటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన సి.హెచ్ విఠల్ ఢిల్లీలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మరో వ్యక్తి తీన్మార్ మల్లన్న కూడా ఇవాళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రులు, తెలంగాణ ఇంఛార్జ్, ఇతర ఎంపీల సమక్షంలో కాషాయం కండువ కప్పుకోనున్నారు.
అయితే తీన్మార్ మల్లన్న రాక భారతీయ జనతా పార్టీ మరీంత బలంగా మారనుంది. గతంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ చుక్కలు చూపించాడు అనడంలో అతియోశక్తి లేదు. ఎందుకంటే అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. అలాగే క్యూ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజానికి అతి దగ్గర ఉన్న వ్యక్తి. ప్రభుత్వ ఆగడాలను, తెరాస పార్టీ చేస్తున్న అక్రమాలను తనదైన శైలిలో ప్రజల్లో తీసుకవెళ్లడంలో మంచి పట్టు సాధించారు. దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు తీన్మార్ మల్లన్నకు ఉన్నారు. ఇటీవల పలు కేసుల్లో జైలుకు వెళ్లిన అతన్ని బయటకు తీసుకరావడానికి బీజేపీ కూడా గట్టి ప్రయత్నం చేసి విజయం సాధించింది.
అయితే స్వతంత్రంగా ఉన్నప్పుడు ఆధారించిన ప్రజలు, కాషాయం కండువ కప్పుకున్న తర్వాత ఆధారిస్తారా లేక అటకెక్కిస్తారా అనేది వేచి చూడాలి.