ఆశావాహులకు కమలం గాలం
KSR – విశ్లేషణ
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా దూసుకపోతోంది భారతీయ జనతా పార్టీ. ఆయా పార్టీల్లో భంగపడ్డ నేతలకు గాలం వేస్తోంది. ఇటీవల జెట్ స్పీడ్‌తో దూసుకపోతున్న పార్టీకి మరిన్ని చేరికలు బూస్టర్ డోస్ ఇవ్వనున్నాయి.
స్వరాష్ట్రం కోస్ కేసీఆర్‌తో కలిసి పని చేసిన నాయకులు ఇప్పుడు ఆ పార్టీలో పోసగడం లేదు. గతంలో వారికి ప్రభుత్వ పరంగా పదువులు కట్టబెట్టినా… ఆ నాయకుల మధ్య ఓ అంతర్‌యుద్దం జరుగుతుందనే చెప్పుకోవాలి. గతంలో మండలి ఛైర్మన్‌గా పని చేసిన స్వామి గౌడ్ దగ్గర నుండి ఇటీవల పార్టీ నుంచి బయటకు వచ్చి బడా నేత ఈటల రాజేందర్‌వరకు. ఇలా పెద్దస్థాయి నేతల నుండి క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల వరుకు గులాబీ వాసన పడడం లేదు. అందుకే వారికి కమలం గాలి ఇష్టమవుతోంది. దీంతో ఇదే అదునుగా చూస్తున్న బీజేపీ కూడా ఆయా నేతలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకుతోంది.
ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశం చూసి పదవులు రాని నాయకులే లక్ష్యంగా భాజపా వారికి గాలం వేయడానికి సిద్ధమైంది. ఇటు తెరాస అటు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాడుతున్న నేతలను కూడా భాజపా గూటికి చేర్చే బాధ్యతను ఈటల రాజేందర్ భూజనా వేసుకున్నట్టు తెలుస్తోంది. అమ్మ పుట్టినిల్లు మేనమామకి తెలియదా అన్నట్లు…. తెరాసలో ఉన్న అసమ్మతి నేతల గురించి అందరికంటే ఎక్కువగా ఈటల తెలిసు. ఆ నింద వేసుకునే ఆయన పార్టీ నుండి బయటకు వచ్చారు. కాబట్టి పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను ఏకం చేసే బాధ్యత తన భూజస్కంధాలపై వేసుకున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో నేతలు ఈటలకు టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి.. పార్టీ నేతలను కలుపుకునే విషయంలో విఫలమైనట్టు ఆ పార్టీ నేతలో బహిరంగంగా వెల్లడించారు. అటు అధిష్టానంతో… ఇటు రేవంత్‌రెడ్డితో విభేదించలేక పార్టీ నుంచి తప్పుకోవడం సముఖంగా ఉంటుందని వారు విశ్వసిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భాజపా బలంగా లేదు… కనీసం పూర్తి స్థానాల్లో అభ్యర్తులు కూడా లేరు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్, తెరాస నుంచి నాయకుల చేరికలు పార్టీకి బలం చేకుర్చనున్నది. సాధారణ ఎన్నికలు వచ్చే సరికి అన్ని స్థానల్లో… బలమైన అభ్యర్తులను నిలిపే ప్రయత్నం ఈ కమలం గాలం అనే చెప్పుకోవాలి.
ఏదీ ఏమైన ఆయా పార్టీ నేతలు భాజపా గూటికి చేరినా… అక్కడ ఎలా సర్థకుంటారు… వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి.