భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వైరస్
అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఒమిక్రాన్ భారతదేశంలోకి ప్రవేశించింది. ఇప్పటికే కరోనాతో పోరాడుతున్న ప్రజలు పెనం మీద నుండి పోయిలో పడినంతా పనైతుంది. కరోనా వల్ల విధించిన లౌక్‌డౌన్ వల్ల అనేక మంది ఆరోగ్యంగా మరియు ఆర్థికంగా కుదేలైపోయినారు. మళ్లీ ఈ కొత్తవైరస్ ఎలాంటి పరిణామాలు సృష్టిస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కర్ణాటకలో ఒక కేసు బయటపడింది. ఇక తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,883 నమూనాలు పరీక్షించగా, 189 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 12, వరంగల్ అర్బన్ జిల్లాలో 10, కరీంనగర్ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.