మంచిర్యాలలో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక సేవలు
దక్షిణభారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన డయాగ్నోస్టిక్ చైన్ అయిన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ లిమిటెడ్ మంచిర్యాలలో తన మొట్టమొదటి డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని హైటెక్ కాలనీలో ప్రారంభించింది. మంచిర్యాల ప్రధాన బస్టాండుకు అత్యంత సమీపంలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రం మంచిర్యాల వాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఆరోగ్య సేవల కోసం వచ్చే ప్రజలందరికీ అత్యుత్తమ స్థాయి డయాగ్నోస్టిక్ సేవలను అందిస్తుంది.
అత్యాధునిక పరిజ్ఞానం, అధునాతన మౌలికసదుపాయాలు కూడిన విజయ డయాగ్నోస్టిక్ 32 స్లైస్ సీటీ స్కాన్, 1.5 టెస్లా ఎంఆర్ఐ, డిజిటల్ మమ్మోగ్రఫీ, డిజిటల్ ఎక్స్-రే, 3డి/4డి అల్ట్రా సోనోగ్రఫీ లాంటి పరికరాలన్నింటితో పూర్తిస్థాయి డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తోంది. వీటితోపాటు పూర్తిస్థాయి ల్యాబొరేటరీ సేవలు ఇక్కడ లభ్యమవుతాయి. కస్టమర్ సేవలు, సౌకర్యాలే వ్యాపారంలో ప్రధానాంశాలుగా ఉన్న ఈ గ్రూపు నిష్ణాతులైన వైద్యులు, నిపుణులైన టెక్నీషియన్లతో వచ్చింది.
ఈ సందర్భంగా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమారి సుప్రితా రెడ్డి మాట్లాడుతూ, “నాణ్యమైన సేవలు, విశ్వసనీయత విషయంల మెట్రో నగరాలతో సమానంగా మంచిర్యాలను నిలబెట్టాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసమే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఫీచర్లున్న పరికరాలను తీసుకొచ్చాం. పరీక్షలలో ఖచ్చితత్వం, నాణ్యతతో పాటు, సరైన సమయానికి నివేదికలు ఇవ్వడం, రోగుల సంరక్షణ విషయంలో జాగ్రత్తలు దీర్ఘకాల మనుగడకు తోడ్పడతాయి” అని తెలిపారు.