గౌతం గంభీర్ కి బెదిరింపులు
వెటరన్ బ్యాటర్.. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వస్తున్నట్లు ఢిల్లీ పోలీసులకు గౌతం గంభీర్ ఫిర్యాుదు చేశారు.
ఐసిస్ కాశ్మీర్ ఉగ్రవాదుల పేరిట బెదిరింపులు వస్తున్నట్లు ఫిర్యాదులో గౌతం గంభీర్ తెలిపారు. తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీ ఈస్ట్ కు ఎంపీగా ఉన్నారు గంభీర్.
ఫిర్యాదు మేరకు గంభీర్ నివాసం వెలుపల భద్రతను పెంచారు. హత్య బెదిరింపులపై దర్యాప్తు జరుగుతోందని సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ తెలిపారు. ఢిల్లీ సెంట్రల్ డిసిపికి రాసిన లేఖలో, గంభీర్ ‘ఐసిస్ కాశ్మీర్’ హ్యాండిల్ నుండి తనకు బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని, ‘మేము నిన్ను మరియు మీ కుటుంబాన్ని చంపబోతున్నాము’ అని రాసి ఉందని పేర్కొన్నాడు. ఢిల్లీ పోలీసులను తగిన భద్రత కల్పించాలని.. ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
గంభీర్‌కు హత్య బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు డిసెంబర్ 2019లో అంతర్జాతీయ నంబర్ నుండి బెదిరింపు కాల్‌లు వచ్చాయని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై అప్పట్లో షహదారా మరియు సెంట్రల్ జిల్లాల డిప్యూటీ కమిషనర్‌లకు లేఖ రాశారు