ఎంజెల్ వన్ స్మార్ట్ సౌధ 2.0 క్యాంపెయిన్

● వివిధ సోషల్ మీడియా వేదికలు, ఓటీటీ, బిజినెస్ చానల్స్, డిస్ ప్లే ప్లాట్ ఫామ్స్, ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లాంటి వాటిపై స్మార్ట్ సౌధ 2.0 క్యాంపెయిన్ ప్రారంభం

● ఏంజెల్ వన్ ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను ఎంతో స్మార్ట్ గా సాధించేలా జెన్ జెడ్, మిలీనియం తరాన్ని ప్రోత్సహించేలా ఈ ఫిన్ టెక్ వేదిక ఇప్పటికే మూడు టీవీసీలను విడుదల చేసింది

● క్విక్ అకౌంట్ ఓపెనింగ్, జీరో బ్రోకరేజ్, ఏఆర్ క్యూ ప్రైమ్ తో స్మార్ట్ రికమెండేషన్స్ వంటి తన విశిష్టతల ప్రయోజనాలను ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రచారం చేస్తున్న ఏంజెల్ వన్



ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ఏంజెల్ వన్ లిమిటెడ్ (గతంలో ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్) తన నూతన క్యాంపెయిన్ స్మార్ట్ సౌధ 2.0 ను ప్రారంభించింది. కంపెనీ వెరీ స్మార్ట్ సొల్యూషన్స్ ఉపయోగించ డం ద్వారా నూతన తరం ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్ బ్యాండ్ వ్యాగన్ లో చేరేందుకు ప్రోత్సహించడం ఈ క్యాంపెయిన్ లక్ష్యం. వివిధ సోషల్ మీడియా వేదికలు, ఓటీటీ, బిజినెస్ చానల్స్, డిస్ ప్లే ప్లాట్ ఫామ్స్, ఆడి యో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లాంటి వాటిపై స్మార్ట్ సౌధ 2.0 క్యాంపెయిన్ ప్రారంభమైంది.

క్యాంపెయిన్ లో భాగంగా టియర్ 2, టియర్ 3 పట్టణాల్లో నూతన తరం ఇన్వెస్టర్లను ప్రోత్సహించేలా ఏంజెల్ వన్ ఇప్పటికే మూడు టీవీసీలను విడుదల చేసింది. మొదటి ఉద్యోగం పొందడం, బైక్ కొనడం, ఓ డాన్స్ స్టూ డియోను ప్రారంభించడం ద్వారా యుక్తవయస్సు లోని ముగ్గురు తమ జీవితాల్లో తెలివైన నిర్ణయాలు తీసు కోడాన్ని ఈ టీవీసీలు చూపిస్తాయి. జెన్ జెడ్, మిలీనియం తరం వారు ఎప్పుడూ ఆయా పనులు చేసేందు కు స్మార్ట్ మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. తెలివైన వారు తమ ఇన్వెస్ట్ మెంట్ అవసరాలకు గాను ఏంజిల్ వన్ ‘వెరీ స్మార్ట్’ విశిష్టతలతో ఎలా ప్రయోజనం పొందగలుగుతారనేది ఈ టీవీసీలలో మరింతగా చూపబడిం ది. క్విక్ అకౌంట్ ఓపెనింగ్, జీరో బ్రోకరేజ్, ఏఆర్ క్యూ ప్రైమ్ తో స్మార్ట్ రికమెండేషన్స్ వంటి ఈ ఫిన్ టెక్ ఆప్షన్లు నేటి తరం ఇన్వెస్టర్ల అవసరాలకు తగిన విధంగా ఉంటాయి.

స్మార్ట్ నూతన తరం ఇన్వెస్టర్ కు వారి ఇన్వెస్టింగ్ అవసరాలకు తగిన విధంగా తన స్మార్ట్ సొల్యూషన్స్ లో ఏం జిల్ వన్ వారికి సాధికారికత అందించడాన్ని ఈ టీవీసీలు నొక్కి చెప్పాయి. ఈ క్యాంపెయిన్ గురించి ఏంజిల్ వ న్ లిమిటెడ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ప్రభాకర్ తివారీ మాట్లాడుతూ, ‘‘ఏంజిల్ వన్ లో మేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్, మెషిన్ లెర్నింగ్ అండతో కూడిన మా అధునాతన పరిష్కారాలతో నూతన తరం ఇన్వెస్టర్లకు తోడ్పడం మా లక్ష్యం. మా నూతన క్యాంపెయిన్, తమకు ఏది మంచో తెలిసిన నూతన భారతీయ ఇన్వెస్టర్లకు వేడుక చే సుకొనేదిగా ఉంటుంది. సాంకేతికత గురించి వారికి తెలుసు మరియు విస్తృత స్థాయి పనులకు వారు దాన్ని ఉ పయోగిస్తారు. స్మార్ట్ సౌదా 2.0 క్యాంపెయిన్ అనేది ఈ స్మార్ట్ ఇన్వెస్టర్లను వారు తమ డబ్బును ఎంతో స్మార్ట్ గా మేనేజ్ చేసుకొనేందుకు తోడ్పడే ఇన్వెస్ట్ మెంట్ సొల్యూషన్స్ కు పరిచయం చేస్తాయి’’ అని అన్నారు.

ఏంజిల్ వన్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నారాయణ్ గంగాధర్ మాట్లాడుతూ, ‘‘స్మార్ట్ సౌదా 2.0 ఆవి ష్కరణతో మేం, ఏంజిల్ వన్ తో తమ ప్రయాణం ప్రారంభించడం ద్వారా స్మార్ట్ ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో ఏ విధంగా విజయం సాధిస్తారో చెప్పదలిచాం. ఏఆర్ క్యూ ప్రైమ్ తో స్మార్ట్ రికమెండేషన్స్, స్మా ర్ట్ మనీ లాంటి ఇతర డిజిటల్ ఉపకరణాలు నూతన తరం ఇన్వెస్టర్లకు వారు సమగ్ర అవగాహనతో నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతాయి. అదే విధంగా దీర్ఘకాలిక వృద్ధికి ప్రాధాన్యపూరిత ఎంపిక గా స్టాక్స్ లో పెట్టుబ డులను చేయడంలో మా జీరో బ్రోకరేజీ ఫీజు తోడ్పడుతుంది’’ అని అన్నారు.

వేగంగా అకౌంట్ ఓపెన్ చేయడం, ఈక్విటీ డెలివరీకి జీరో చార్జెస్ వంటి ఐట్రేడ్ ప్రైమ్ ప్లాన్, ఇంట్రాడే కు ఆర్డర్ కు రూ.20, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లు, కరెన్సీ అండ్ కమాడిటీ లాంటి అంశాలతో పాటుగా వివిధ అసెట్ క్లాసెస్ లో తేలిగ్గా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా వెబ్, మొబైల్ లలో ఏంజిల్ వన్ సాంకేతిక ఆధారిత స్మార్ట్ ఏపీఐ ప్లాట్ ఫామ్ ను అందిస్తుంది. దీని స్మార్ట్ ఏఫీఐ ప్లాట్ ఫామ్ అందరు క్లయింట్లు, స్టార్టప్ లు, భాగస్వాములకు అందుబాటులో ఉంటుంది. వారు తమ వ్యూహాలను, వెబ్ సైట్స్, యాప్స్ ను, వివిధ ప్లాట్ ఫామ్ లను ఏంజిల్ వన్ ట్రేడింగ్ సిస్టమ్స్ తో ఇంటిగ్రేట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. క్లయింట్ల అవసరాలను తీర్చేందుకు నిరంతర వినూత్నతను ఈ ఫిన్ టెక్ కంపెనీ విశ్వసిస్తుంది.