ఎన్జీఆర్ఐ ఉద్యోగికి ఓయూ డాక్టరేట్
వరంగల్ జిల్లా శంభునిపేట్ గ్రామానికి చెందిన ఆడేపు శ్రీధర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ , లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ సీఎస్‌ఐఆర్ ఆర్గనైజేషన్స్–ఏ సైంటోమెట్రిక్ స్టడీ ఆన్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) స్టడీ పేరిట పరిశోధన నిర్వహించారు. పలు లైబ్రరీ సైన్స్ జర్నల్స్‌లో రీసెర్చ్ పేపర్స్ కూడా ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఈయన హబ్సిగూడలోని సీఎస్‌ఐఆర్–ఎన్‌జీఆర్‌ఐలో టెక్నికల్ ఆఫీసర్ లైబ్రరీగా ఉద్యోగం చేస్తున్నాడు. ఓయూలోని లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ యాదగిరి పర్యవేక్షణలో శ్రీధర్ పీహెచ్‌డీ పూర్తి చేశారు.