స్మూత్ క్యూ3, విబిల్ 2 జింబల్ ఆవిష్కరించిన జియున్ ఇండియా
కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ప్రపంచ ప్రముఖ జింబల్
బ్రాండ్ జియున్ భారతదేశంలో 2 సరికొత్త జింబల్స్ స్మూత్ క్యూ3, విబిల్ 2ను ఆవిష్కరించింది.
మీ వీడియోలను మరింత ఉజ్వలంగా మార్చేందుకు ఈ రంగంలో మొట్టమొదటిసారిగా సరికొత్త ఫీచర్లతో వచ్చింది స్మూత్-క్యూ3. క్యాంప్యాక్ట్‌గా ఉండే ఈ జింబల్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. త్రీ-యాక్సిస్ జింబల్, ప్రత్యేకమైన రొటెటబుల్ ఫిల్ లైట్, 17 స్మార్ట్ టెంప్లేట్స్‌తో పాటు సులభమైన, సవివరమైన డిజైన్ దీని సొంతం. ఈ జింబల్‌లో 4300k వార్మ్ టోన్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిల్ లైట్, మూడు లెవల్స్‌లో బ్రైట్ అడ్జస్ట్‌మెంట్, ఫ్రంట్, రియర్ లైటింగ్ కోసం 180° టచ్ బటన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ఫీచర్లతో చాలా కాలంగా సవాల్‌గా ఉన్న లో-లైటింగ్ సెటప్స్ సమస్యను బ్రాండ్ చక్కదిద్దింది.
దీనితో పాటు ZY Cami (జడ్‌వై క్యామీ) యాప్‌తో స్మూత్-క్యూ3 యూజర్లు స్మార్ట్ టెంప్లేట్స్, అడ్వాన్స్డ్ ఎడిటర్ వంటి కొత్త ఫీచర్లతో గతంలో కంటే అధిక విధాలుగా ఇప్పుడు తమ స్టోరీలు క్యాప్చర్ చేయవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు.
అదనంగా అందిస్తున్న కొత్త ఫీచర్లలో గెస్చర్ కంట్రోల్, స్మార్ట్ ఫాలో 3.0 ఆబ్జెక్ట్ ట్రాకింగ్, ఇన్‌స్టంట్ డాలీ జూమ్, మ్యాజిక్ క్లోన్ ప్యానోరమా వంటివి ఉన్నాయి. టార్గెట్ మార్క్ చేసి స్మార్ట్ ఫాలోయింగ్ యాక్టివేట్ చేసి ఆపరేట్ చేసేందుకు మ్యాజిక్ క్లోన్ ప్యానోరమాకు సింగిల్ ప్రెస్ ట్రిగ్గర్ బటన్ ఉంది.
ఈ జింబల్ ఒక కాంప్యాక్ట్ పవర్ హౌస్. ఇంతకు ముందు దానితో పోల్చితే దీన్ని సులభంగా ఫోల్డ్ చేయవచ్చు, బరువు కూడా తక్కువ. స్మూత్-క్యూ2 అత్యధిక గరిష్ఠ పేలోడ్ కలిగి ఉంది. ఇది 45154180ఎంఎం వరకు మెజర్ చేస్తుంది, బరువు మాత్రం 340 గ్రాములే. ఇది 280 గ్రామ్ స్మార్ట్ ఫోన్ పేలోడ్ కూడా హ్యాండిల్ చేస్తుంది.
స్మూత్ క్యూ3 అన్ని ప్రధాన ఆండ్రాయిడ్ & యాపిల్ ఫోన్లకు సపోర్టు చేస్తుంది, కంటెంట్ క్రియేటర్లు, ఇతరులకు మెరుగైన క్వాలిటీ అందిస్తుంది.
కొత్త ప్రొడక్టు ఆవిష్కరణ సందర్భంగా జియూన్ ఇండియా ప్రతినిధి మయాంక్ చచ్రా మాట్లాడుతూ, “ భారతీయ మార్కెట్ నుంచి మాకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు మేము ప్రతీ నెల 60% వృద్ధిని చూశాం. ప్రస్తుతం మా బ్రాండ్ నుంచి 11 ఉత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను 15 పెంచాలని అనుకుంటున్నాం. మేము సౌకర్యంతో పాటు అందాన్ని కూడా మా యూజర్స్‌కు ఇవ్వాలనుకుంటాం. ఇప్పుడు మేము ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు ఆ మాటకు అనుగుణంగా ఉంటాయి” అన్నారు.
భారతీయుల కోసం తన ఉత్పత్తులు విస్తరించేందుకు ఈ బ్రాండ్ కట్టుబడి ఉండటమే కాదు వారికి సరికొత్త టెక్నాలజీని అందిస్తోంది. జియున్ ఇటీవలే స్మార్ట్ స్టెబిలైజర్ స్మూత్ XS ను భారతదేశంలో ఆవిష్కరించింది. చివరిసారి కొత్త ఉత్పత్తి ఆవిష్కరించిన నెలలోపే స్మూత్ Q3, విబిల్ 2ను ఆవిష్కరించడం, ఈ మార్కెట్‌పై బ్రాండ్ చూపుతున్న ఉత్సాహానికి నిదర్శనం.