దక్షిణ హైదరాబాద్‌లో రూ.175 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సుచిర్ ఇండియా
దక్షిణ భారతదేశంలోనే రియల్ ఎస్టేట్, ఆతిథ్య రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న సుచిర్ ఇండియా సంస్థ హైదరాబాద్ నగరానికి దక్షిణాన ఉన్న శంషాబాద్ సమీపంలోని సాతంరాయి ప్రాంతంలో అత్యాధునిక నివాస ప్రాంగణాన్ని నిర్మించడానికి రూ. 175 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అని పేరుపెట్టిన ఈ ప్రాంగణం నగరంలో శరవేగంగా విస్తరిస్తున్న కారిడార్లలో ఒకటిగా నిలవనుంది.
ఇక్కడ నివసించేవారు ప్రాచీన, ఆధునిక జీవనశైలిని ఒకేసారి అనుభవించగలరు. ఇక్కడి భవనాల ఆకృతులను గ్రీకు కాలం నుంచి పొందిన స్ఫూర్తితో రూపొందించగా, అందులోని సదుపాయాలు, హోం ఆటోమేషన్ లాంటివి అత్యంత ఆధునికంగా ఉంటాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ప్రాజెక్టు ఇంకా ఔటర్ రింగ్ రోడ్డుకు, అంతర్జాతీయ విమానాశ్రయానికి, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులకు, ఎంఎంటీఎస్, మాల్స్, ఐటీ కారిడార్.. ఇలా అన్నింటికీ చేరువగా ఉంటుంది. ద టేల్స్ ఆఫ్ గ్రీక్ కు భరణీయ అభివృద్ధి విభాగంలో ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ రావడం హైదరాబాద్ నగరంలోనే చాలా అరుదు. ఈ ప్రాజెక్టులో మొత్తం నిర్మాణ ప్రాంతం 6 లక్షల చదరపు అడుగులు. ఇందులో 398 నివాస ఫ్లాట్లు ఉంటాయి. ఇవి ఒక్కోటి రూ. 45 లక్షలు. ఇవి 2023 నవంబర్ నాటికి పూర్తవుతాయి.
ఈ ప్రాజెక్టు గురించి సుచిర్ ఇండియా ఛైర్మన్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ, “దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్, వైవిధ్యమైన పరిశ్రమలు వృద్ధి చెందడం, ప్రపంచస్థాయి ఫార్మా సిటీ కూడా త్వరలో వస్తుండటం, అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు, విమాన కనెక్టివిటీ ఉండటంతో హైదరాబాద్ దక్షిణ ప్రాంతం దేశంలోనే ప్రధానమైన గమ్యంగా మారింది. అవసరమైన అన్ని సదుపాయాలు, సులభమైన కనెక్టివిటీ ఉండటంతో ఇక్కడే ఈ నివాస ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాము. ఇవి ఇళ్లు కొనాలనుకునే నవతరం వారికి, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అనుకూలం. వారికి కావల్సిన అన్ని సదుపాయాలూ చాలా తక్కువ ధరలకే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ద టేల్స్ ఆఫ్ గ్రీక్ వారికి సరిగ్గా సరిపోతుంది కూడా” అన్నారు.
“ద టేల్స్ ఆఫ్ గ్రీక్ డిజైన్ల విషయంలోను, అభివృద్ధి చెందే కమ్యూనిటీలోనే కోరుకునే జీవనశైలిని అందించడంలో విభిన్నంగా ఉంటుంది. మీ జీవనశైలిని మరింతగా మెరుగుపరిచేందుకు హైదరాబాద్ డౌన్‌టౌన్‌లో ద టేల్స్ ఆఫ్ గ్రీక్‌లోని లగ్జరీ సూట్లు, స్టూడియో అపార్టుమెంట్లలో ఉండే ఐకానిక్ నిర్మాణాలు, వాటిలో ఉండే అద్భుతమైన అనుభవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నగరంలోని రణగొణ ధ్వనుల నుంచి దూరంగా ఉంటూ, మీ మనసును ఉల్లాసంగా ఉంచుకుంటూ, మీరు.. మీ ప్రియతములు ఎలాంటి ఆటంకం లేకుండా జీవిస్తూ, మీకే సొంతమని భావించే ప్రాంతంలో అపరిమితంగా ఉండచ్చు” అని డాక్టర్ కిరణ్ వివరించారు.
రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సుచిర్ ఇండియా చేతిలో ప్రస్తుతం బెంగళూరు హైవేపై కొత్తూరు సమీపంలో గిజాపొలిస్, అల్వాల్ సమీపంలో ఆర్యావర్తనగరి లాంటివాటితో పాటు మరో 12 ప్రాజెక్టులు కూడా త్వరలో రానున్నాయి. 2025 నాటికి సుచిర్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు రోడ్‌మ్యాప్ సిద్దం చేసుకుంది.